1. {యోబు జవాబు} [PS] అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2. “నేను చెప్పేది వినండి. [QBR2] మీరు వినటమే మీరు నాకు ఇచ్చే ఆదరణ. [QBR]
3. నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. [QBR2] ఆ తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు నన్ను గేళి చేయవచ్చు.
4. “నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు. [QBR2] నేను ఓపికగా ఉండకపోవటానికి ఒక మంచి కారణం ఉంది. [QBR]
5. నన్ను చూచి, అదరిపొండి. [QBR2] మీ నోటిమీద చేయి పెట్టుకొని అదురుతో నన్ను అలానే తేరి చూడండి. [QBR]
6. నాకు సంభవించిన దానిని గూర్చి [QBR2] తలచినప్పుడు నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది. [QBR]
7. దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు? [QBR2] వారు ముసలివాళ్లవ్వటం, విజయం పొందటం ఎందుకు? [QBR]
8. దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు. [QBR2] దుర్మార్గులు వారి మనుమలు, మనుమ రాండ్రను చూసేంత వరకు బతుకుతారు. [QBR]
9. వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు. [QBR2] దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన దండం ఉపయోగించడు. [QBR]
10. వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. [QBR2] వారి ఆవులకు దూడలు ఉన్నాయి. [QBR2] ఆ దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు. [QBR]
11. దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గొర్రె పిల్లల్లా బయటకు పంపిస్తారు. [QBR2] వారి పిల్లలు గంతులు వేస్తారు. [QBR]
12. స్వరమండలాలు, పిల్లనగ్రోవుల ధ్వనులతోబాటు వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు. [QBR]
13. దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభవిస్తారు. [QBR2] అనగా వారు మరణించి, శ్రమ అనుభవించకుండానే తమ సమాధికి వెళ్తారు. [QBR]
14. కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, ‘మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి, [QBR2] మేము ఏమి చేయాలని మీరు కోరుతారో అది మాకు లెక్కలేదు’ అంటారు. [QBR]
15. మరియు దుర్మార్గులు, ‘సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు? [QBR2] మేము ఆయనను సేవించాల్సిన అవసరం లేదు. [QBR2] ఆయనకు ప్రార్థన చేసిన లాభం లేదు’ అంటారు.
16. “దుర్మార్గులు తమ మూలంగానే వారికి విజయం కలుగుతుందని తలస్తారు. [QBR2] కానీ నేను వారి తలంపును అంగీకరించను. [QBR]
17. అయితే దుర్మార్గులు దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది? [QBR2] దుర్మార్గులకు ఎన్నిసార్లు కష్టం వస్తుంది? [QBR2] దేవుడు వారి మీద కోపగించి వారిని శిక్షిస్తాడా? [QBR]
18. గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గావి ఊకను ఎగురగొట్టినట్లు [QBR2] దేవుడు దుర్మార్గులను ఎగుర గొట్టి వేస్తాడా? [QBR]
19. ‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు. [QBR2] కాదు! ఆ దుర్మార్గుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మార్గుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడుతున్నట్టు అతనికి తెలుస్తుంది. [QBR]
20. పాపి తన స్వంత శిక్షను చూడాలి. [QBR2] సర్వశక్తిమంతుడైన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు. [QBR]
21. దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు [QBR2] అతడు విడిచిపెడుతున్న తన కుటుంబం విషయమై అతడు లెక్కచేయడు.
22. “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు. [QBR2] ఉన్నత స్థానాల్లో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్పు తీరుస్తాడు. [QBR]
23. ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు. [QBR2] అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు. [QBR]
24. అతని శరీరం బాగా పోషించబడింది, [QBR2] అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి [QBR]
25. అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు. [QBR2] అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు. [QBR]
26. వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు. [QBR2] వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి.
27. “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. [QBR2] మరియు మీరు నాకు అపకారం చేయాలని తలపెడుతున్నారని నాకు తెలుసు. [QBR]
28. ‘యువరాజు ఇల్లు ఎక్కడ? [QBR2] దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?’ అని మీరు అంటారు.
29. “కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు. [QBR2] వారి కథలను మీరు అంగీ కరించనూ లేదు. [QBR]
30. విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్ట బడుతారు. [QBR2] ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు. [QBR]
31. దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు. [QBR2] అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ శిక్షించరు. [QBR]
32. దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు [QBR2] ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు. [QBR]
33. ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది. [QBR2] వాని చావు ఊరేగింపులో వేలాది మంది ఉంటారు.
34. “అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు. [QBR2] మీ జవాబులు ఇంకా అబద్ధాలే!” [PE]