1. “మనుష్యులకు వెండి లభిర చే గనులు ఉన్నాయి. [QBR2] మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి. [QBR]
2. మనుష్యలు భూమినుండి ఇనుమును తవ్వుతారు. [QBR2] బండల నుండి రాగి కరిగించబడుతుంది. [QBR]
3. పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు. [QBR2] ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలిచీకటిలో బండల కోసం వారు వెదుకుతారు. [QBR]
4. మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు. [QBR2] మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు. [QBR2] పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు. [QBR]
5. భూమిపై నుండి ఆహారం వస్తుంది. [QBR2] కానీ భూమి కింద, వస్తువులను మంట మార్చివేసినట్టు, [QBR2] అది మార్చివేయబడుతుంది. [QBR]
6. నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి. [QBR2] నేల కింద మట్టిలో బంగారం ఉంది. [QBR]
7. ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు. [QBR2] డేగ కూడా ఈ మార్గం చూడదు. [QBR]
8. కృర మృగాలు ఈ మార్గంలో నడవలేదు. [QBR2] సింహాలు ఈ మార్గంలో పయనించలేదు. [QBR]
9. పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు. [QBR2] ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు. [QBR]
10. పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు. [QBR2] బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు. [QBR]
11. నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు. [QBR2] దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.
12. “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? [QBR2] గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి? [QBR]
13. జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు. [QBR2] భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు. [QBR]
14. ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. [QBR2] ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది. [QBR]
15. అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము. [QBR2] జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు. [QBR]
16. ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని, [QBR2] నీలంతో గాని, అది కొనబడేది కాదు. [QBR]
17. బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది. [QBR2] బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు. [QBR]
18. జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది. [QBR2] జ్ఞానం కెంపువకంటె ఖరీదైనది. [QBR]
19. ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు. [QBR2] మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.
20. “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి? [QBR2] అవగాహన చేసికోవటం నేర్చుకోనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి? [QBR]
21. భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది. [QBR2] ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు. [QBR]
22. ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ [QBR2] అని మరణం, నాశనం చెబుతాయి.
23. “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. [QBR2] జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు. [QBR]
24. భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు. [QBR2] ఆకాశాల కింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు. [QBR]
25. గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, [QBR2] మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు, [QBR]
26. వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, [QBR2] ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించి నప్పుడు [QBR]
27. అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు [QBR2] దానిని పరీ క్షించిన సమయం అవుతుంది. [QBR2] జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు. [QBR]
28. ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది. [QBR2] చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’ ” [QBR] అని దేవుడు ప్రజలతో చెప్పాడు. [PE]