1. అప్పుడు ఎలీహు మాట్లాడటం కొన సాగించాడు:
2. “జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి. [QBR2] తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి. [QBR]
3. చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది. [QBR2] అదే విధంగా నాలుక, తన తాకే వాటిని రుచి చూస్తుంది. [QBR]
4. అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి. [QBR2] ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చు కొంటాం. [QBR]
5. యోబు అంటున్నాడు, ‘యోబు అనే నేను నిర్దోషిని. [QBR2] కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు. [QBR]
6. నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు. [QBR2] నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’
7. “యోబులాంటి వ్యక్తి మరొకడు లేడు. [QBR2] మీరు యోబును అవమానించినప్పటికి అతడు లెక్క చేయడు. [QBR]
8. చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు. [QBR2] దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం. [QBR]
9. ‘ఎందుకంటే, ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే [QBR2] దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలుగదు’ అని యోబు చెబుతున్నాడు.
10. “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాటవినండి. [QBR2] దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. [QBR2] సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు. [QBR]
11. ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు. [QBR2] మనుష్యలకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు. [QBR]
12. ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు. [QBR2] సర్వశక్తి మంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు. [QBR]
13. భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు? [QBR2] భూభారాన్ని దేవునికి ఎవరు అప్పగించారు? (దేవుడు అన్నింటినీ పుట్టించాడు మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.) [QBR]
14. దేవుడు తన ఆత్మను, [QBR2] తన ప్రాణవాయువును మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అనుకొంటే [QBR]
15. అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చని పోతారు. [QBR2] అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.
16. “మీరు జ్ఞానంగల వారైతే, [QBR2] నేను చెప్పేది వినండి. [QBR]
17. న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషి పరిపాలకునిగా ఉండజాలడు. [QBR2] యోబూ, బలమైన మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు తలుస్తున్నావా? [QBR]
18. ‘మీరు పనికిమాలిన వాళ్లు’ అని రాజులతో చెప్పేవాడు దేవుడు. [QBR2] ‘మీరు దుర్మార్గులు’ అని నాయకులతో దేవుడు చెబుతాడు. [QBR]
19. దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు. [QBR2] దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు. [QBR2] ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక. [QBR]
20. ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించ వచ్చును. [QBR2] మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు. [QBR2] వారు మరణిస్తారు. [QBR2] ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు.
21. “మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. [QBR2] ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు. [QBR]
22. దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొనేందుకు చీకటి చోటు ఏమీ లేదు. [QBR2] ఏ చోటైన చీకటిగా ఉండదు. [QBR]
23. మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు. [QBR2] మనుష్యులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు. [QBR]
24. దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. [QBR2] కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు. [QBR]
25. కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు. [QBR2] అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి, వారిని నాశనం చేస్తాడు. [QBR]
26. చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు. [QBR2] ఆ చెడ్డవారిని అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు [QBR]
27. ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత కావటం మానివేశారు గనుక. [QBR2] మరియు ఆయన కొరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య పెట్టలేదు గనుక. [QBR]
28. పేద ప్రజలను బాధించి, వారు సహాయం కోసం దేవునికి మొర పెట్టేలాగా ఆ చెడ్డవాళ్లు చేశారు. [QBR2] మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టి నప్పుడు ఆయన వింటాడు. [QBR]
29. కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయ కూడదని [QBR2] కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ ఆయనను దోషిగా నిర్ణయించలేరు [QBR] ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు. [QBR2] అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను పాలిస్తాడు. [QBR]
30. తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని [QBR2] దేవుడు పాలకునిగా ఉండనివ్వడు.
31. “ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును: [QBR2] ‘నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను. [QBR]
32. దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు. [QBR2] నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.’ [QBR]
33. కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ ఉండగా, [QBR2] నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా? [QBR] యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు. [QBR2] నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు. [QBR]
34. జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో ఏకిభవిస్తాడు. [QBR2] నా మాటలు వినే జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అని అంటారు, [QBR]
35. ‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు. [QBR2] యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’ [QBR]
36. యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ. [QBR2] ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనుక. [QBR]
37. యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం అదనంగా కలిపాడు. [QBR2] యోబు మనలను అవమానించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.” [PE]