1. ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు.
2. “యోబూ, నాతో ఇంకొంచెం ఓపికగా ఉండు. [QBR2] దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని నేను నీకు చూపిస్తాను. [QBR]
3. నా జ్ఞానాన్ని అందరితోనూ పంచుకొంటాను. [QBR2] దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు న్యాయంగల వాడని నేను రుజువు చేస్తాను. [QBR]
4. యోబూ, నేను చెప్పేది ప్రతీదీ సత్యం. [QBR2] నేను చెప్తున్నదేమిటో తెలిసే చెప్తున్నాను.
5. “దేవుడు శక్తివంతమైనవాడు, [QBR2] కానీ ఆయన మనుష్యులను ద్వేషించడు. [QBR] దేవుడు మహత్తర శక్తిమంతుడు, [QBR2] ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి. [QBR]
6. దుర్మార్గులను దేవుడు బ్రతుకనివ్వడు. [QBR2] పేద ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు న్యాయం జరిగిస్తాడు. [QBR]
7. ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. [QBR2] మంచి వాళ్లను ఆయన పాలకులుగా ఉండనిస్తాడు. [QBR2] మంచి వాళ్లకు దేవుడు శాశ్వతమైన ఘనత ఇస్తాడు. [QBR]
8. కానీ మనుష్యులు శిక్షించబడుతూ [QBR2] సంకెళ్లతో ఉంటే ఒకవేళ మనుష్యులు శ్రమపడతూ, కష్టాలు అనుభవిస్తోంటే, [QBR]
9. వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబుతాడు. [QBR2] వారు పాపం చేశారని, వారు అతిశయించారని దేవుడు వారికి చెబుతాడు. [QBR]
10. దేవుడు వాళ్ల చెవులు వినేలా తెరుస్తాడు. [QBR2] వారు పాపం చేయటం చాలించాలని ఆయన వారికి ఆజ్ఞ ఇస్తాడు. [QBR]
11. ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు విధేయులైతే, [QBR2] దేవుడు వారిని విజయవంతమైన ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు. [QBR]
12. కానీ ఆ మనుష్యులు దేవునికి విధేయులయ్యేందుకు నిరాకరిస్తే వారు మృతుల లోకంలో చేరిపోతారు. [QBR2] ఏది నిజమైన జ్ఞానమో తెలియకుండా వాళ్లు (మూర్ఖులుగా) చనిపోతారు.
13. “దేవుని గూర్చి లక్ష్యపెట్టని మనుష్యులు ఎల్లప్పుడూ కక్షతో ఉంటారు. [QBR2] దేవుడు వారిని శిక్షించినప్పటికీ, వారు సహాయం కోసం దేవుని ప్రార్థించ నిరాకరిస్తారు. [QBR]
14. ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే మరణిస్తారు. [QBR2] మగ వ్యభిచారులతోబాటు వారుకూడా అవమానంతో మరణిస్తారు. [QBR]
15. కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు. [QBR2] మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయోగిస్తాడు.
16. “యోబూ, దేవుడు నీ మీద దయ చూపించి, [QBR2] నీ కష్టాల నుండి నిన్ను బయటకు రప్పించి నీకు సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. [QBR2] దేవుడు నీకు క్షేమకరమైన స్థలం ఇవ్వాలనీ నీ బల్లమీద సమృద్ధిగా భోజనం ఉంచాలనీ కోరుతున్నాడు. [QBR]
17. కానీ యోబూ, దుర్మార్గులవలె నీవు శిక్షించబడుతున్నావు. దేవుని న్యాయం, తీర్పు నిన్ను పట్టేశాయి. [QBR]
18. యోబూ, ధనం నీ చేత తప్పు చేయించనీయకుండును గాక. [QBR2] విస్తారమైన ధనాశ చూపించినందువల్ల మోసపోవద్దు. [QBR]
19. నీ ధనం అంతా ఇప్పుడు నీకు సహాయం చేయలేదని నీకు తెలుసు. [QBR2] శక్తిమంతుల సహాయం కోసం మొరపెట్టినందువల్ల ఏమి లాభం లేదు. [QBR]
20. ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం ఆశించకు. [QBR2] (వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని అనుకొంటున్నారు.) [QBR]
21. యోబూ, తప్పు చేయకుండా జాగ్రత్త పడు. [QBR2] ఎందుకంటే నీవు ఈ కష్టాన్ని ఎన్నుకొన్నావు.
22. “దేవునికి చాలా శక్తి ఉంది. [QBR2] దేవుడే అందరిలోకెల్ల గొప్ప ఉపదేశకుడు. [QBR]
23. ఏమి చేయాలి అనేది దేవునికి ఎవరూ చెప్పలేరు. [QBR2] ‘దేవా నీవు తప్పు చేశావు’ అని ఎవరూ దేవునికి చెప్పలేరు. [QBR]
24. దేవునిని తాను చేసిన పనిని బట్టి స్తుతించటం మరువకు. [QBR2] మనుష్యులు దేవునిని కీర్తనలతో స్తుతించారు. [QBR]
25. ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు. [QBR2] మనుష్యులు దేవుని పనిని దూరం నుండి చూశారు. [QBR]
26. దేవుడు గొప్పవాడు. అది నిజం. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేం. [QBR2] దేవునికి ఎన్ని సంవత్సరాలో ఏ మనిషీ లెక్కించలేడు.
27. “దేవుడు భూమినుండి నీళ్లు తీసుకొని [QBR2] దాన్ని వర్షంగా మారుస్తాడు. [QBR]
28. ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు. [QBR2] మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది. [QBR]
29. దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి గ్రహించలేడు. [QBR2] దేవుడు నివసించే ఆకాశంలోనుంచి ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించలేడు. [QBR]
30. అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా [QBR2] దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు. [QBR]
31. రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం ఇచ్చేందుకు [QBR2] దేవుడు ఈ మేఘాలను ప్రయోగిస్తాడు. [QBR]
32. దేవుడు మెరుపులను తన చేతితో పట్టుకొంటాడు. [QBR2] దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు దానికి ఆజ్ఞాపిస్తాడు. [QBR]
33. తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది. [QBR2] తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా తెలుసు. [PE]