1. {దేవుడు యోబుతో మాట్లాడటం} [PS] అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు జవాబు ఇచ్చాడు. దేవుడు చెప్పాడు:
2. “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన, [QBR2] తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే ఈ మనిషి ఎవరు? [QBR]
3. యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు. [QBR2] నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగాఉండు.
4. “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? [QBR2] నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు. [QBR]
5. యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు? [QBR2] నీకు తెలిసినట్టే ఉంది! కొల బద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు. [QBR]
6. భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి? [QBR2] భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు? [QBR]
7. అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసిపాడాయి. [QBR2] దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
8. “యోబూ, భూమి అగాధములో నుండి [QBR2] సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు? [QBR]
9. ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను. [QBR2] మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను. [QBR]
10. సముద్రానికి హద్దులు నేనే నియమించాను. [QBR2] మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను. [QBR]
11. నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు. [QBR2] నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.
12. “యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో [QBR2] నీవు ఎప్పుడైనా చెప్పావా? [QBR]
13. యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని, [QBR2] దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా? [QBR]
14. ఉదయపు వెలుగు కొండలు, [QBR2] లోయలు కనబడేటట్టు చేస్తుంది. [QBR] పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు [QBR2] ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి. [QBR] అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా [QBR2] ఆ స్థలాలు ఆకారాలు రూపొందు తాయి. [QBR]
15. దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. [QBR2] అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది.
16. “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా? [QBR2] మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా? [QBR]
17. యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను [QBR2] ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా? [QBR]
18. యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా? [QBR2] ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు.
19. “యోబూ, వెలుగు వచ్చే దిశగా పోయేందుకు ఎటు వెళ్లాలి? [QBR2] చీకటి ఎక్కడ నుండి వస్తుంది? [QBR]
20. యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా? [QBR2] అవి నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా? [QBR]
21. యోబూ, నీవు చాలా ముసలివాడిని కదా? [QBR2] భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ?
22. “యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ ఉంచే గిడ్డంగులకు [QBR2] నీవు ఎప్పుడైనా వెళ్లావా? [QBR]
23. కష్టదినాల్లో ఉపయోగించేందుకు యుద్ధాన్ని, పోరాట దినాలకు ఉపయోగించేందుకు హిమమును, [QBR2] వడగండ్లను నేను దాచిపెడతాను. [QBR]
24. యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పైకి వస్తాడో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? [QBR2] భూమి అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడనుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? [QBR]
25. యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు? [QBR2] ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు? [QBR]
26. యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట నీళ్లు ఉండునట్లు. [QBR]
27. బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి, [QBR2] ఈ సంగతులను చేసిన వారు ఎవరు? [QBR]
28. యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా? [QBR2] మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి? [QBR]
29. యోబూ, హిమమునకు తల్లి ఎవరు? [QBR2] ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు? [QBR]
30. జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు [QBR2] గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి?
31. “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? [QBR2] మృగశీర్షకు కట్లు నీవు విప్పగలవా? [QBR]
32. యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్టు నీవు చేయగలవా? [QBR2] లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా? [QBR]
33. యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా? [QBR2] భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా?
34. “యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు [QBR2] నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా? [QBR]
35. యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా? [QBR2] మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’ [QBR2] అని అంటాయా?
36. “ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు? [QBR2] మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు? [QBR]
37. యోబూ, మేఘాలను లెక్కించుటకు, [QBR2] అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు? [QBR]
38. ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది. [QBR2] ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.
39. “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా? [QBR2] ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా? [QBR]
40. అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో [QBR2] పండుకొని లేక కూర్చొని ఉంటాయి. [QBR]
41. యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు [QBR2] కాకులను పోషించేది ఎవరు? [PE]