1. “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా? [QBR2] తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా? [QBR]
2. యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా? [QBR2] అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా? [QBR]
3. అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి. [QBR2] అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి. [QBR]
4. తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి. [QBR2] అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.
5. “యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు? [QBR2] వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు? [QBR]
6. అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను). [QBR2] అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను. [QBR]
7. అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు. [QBR2] ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు. [QBR]
8. అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి. [QBR2] అక్కడే అవి గడ్డి తింటాయి. [QBR2] తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.
9. “యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా? [QBR2] రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుంది? [QBR]
10. యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా? [QBR2] నీ కోసం అది లోయలను దున్నుతుందా? [QBR]
11. యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు [QBR2] నీవు దానిమీద ఆధార పడగలవా? [QBR2] మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా? [QBR]
12. నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు [QBR2] అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?
13. “నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది. [QBR2] (కానీ అది ఎగుర లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్కల్లాంటివి కావు. [QBR]
14. నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది. [QBR2] ఇసుకలో అవి వెచ్చగా అవుతాయి. [QBR]
15. ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని [QBR2] లేక ఏదైనా అడవి జంతువు వాటిని పగుల గొట్టవచ్చని నిప్పుకోడి మరచిపోతుంది. [QBR]
16. నిప్పుకోడి తన పిల్లలను చూడదు. [QBR2] ఆ పిల్లలు తనవి కానట్టే చూస్తూంది. [QBR2] దాని పిల్లలు చస్తే దాని ప్రయాస అంతా వ్యర్థం అయిందనే విషయం దానికి లక్ష్యం లేదు. [QBR]
17. ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు. [QBR2] నిప్పుకోడి తెలివి తక్కువది. నేను దాన్ని అలాగే చేశాను. [QBR]
18. కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది. [QBR2] ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.
19. “యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా? [QBR2] లేక దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు పెట్టావా? [QBR]
20. యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా? [QBR2] గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మనుష్యుల్ని భయపెడ్తుంది. [QBR]
21. గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది. [QBR2] అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్ధానికి వెళ్లేటప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుంది [QBR]
22. భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది. [QBR2] అది భయపడదు. యుద్ధం నుండి అది పారిపోదు. [QBR]
23. గుర్రం మీద అంబులపొది వణకుతుంది. [QBR2] దానిరౌతువద్ద ఉన్న బల్లెం, ఆయుధాలు సూర్యకాంతిలో తళతళలాడుతాయి. [QBR]
24. గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది. [QBR2] బూరధ్వని వింటే గుర్రం ఇంక నిలబడలేదు. [QBR]
25. బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓ హో’ అంటుంది. [QBR2] దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది. [QBR2] సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.
26. “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా? [QBR]
27. యోబూ, పక్షిరాజు ఎగరాలని, [QBR2] పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా? [QBR]
28. పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది. [QBR2] ఆ బండ పక్షిరాజు యొక్క కోట. [QBR]
29. పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది. [QBR2] దూరంలో ఉన్న ఆహారాన్ని అది చూడగలదు. [QBR]
30. పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి. [QBR2] అవి చచ్చిన శవాల చుట్టూరా చేరుతాయి.” [PE]