1. యోబూతో యెహోవా ఇలా చెప్పాడు:
2. “యోబూ, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు వాదించావు. [QBR2] తప్పు చేశానని నీవు నాకు తీర్పు చెప్పావు. [QBR2] ఇప్పుడు నీవు తప్పుచేశావని ఒప్పుకుంటావా? నాకు జవాబు ఇస్తావా?” [PS]
3. అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:
4. “నేను ముఖ్యం కాదు. [QBR2] నీకు నేను ఏమి చెప్పగలను? [QBR] నీకు నేను జవాబు ఇవ్వలేను. [QBR2] నా చేతితో నేను నా నోరు మూసుకొంటాను. [QBR]
5. నేను ఒకసారి మాట్లాడాను కానీ నేను మరల జవాబు ఇవ్వను. [QBR2] నేను రెండుసార్లు మాట్లాడాను. కానీ నేను ఇంకా ఏమీ చెప్పను.” [PS]
6. అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు:
7. “యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు.
8. “యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా? [QBR2] నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా? [QBR]
9. యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా? [QBR2] నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు నీవు చేయగలవా? [QBR]
10. ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు. [QBR]
11. యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు. [QBR2] యోబూ, ఆ గర్విష్ఠుల మీద నీ కోపం కుమ్మరించు. ఆ గర్విష్ఠులను దీనులుగా చేయి. [QBR]
12. అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు. [QBR2] వారిని దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న చోటనే చితుకగొట్టు. [QBR]
13. గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు. [QBR2] వారి శరీరాలను చుట్టేసి వారి సమాధులలో పెట్టు [QBR]
14. యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే [QBR2] అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్ధుడ వని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను.
15. “యోబూ, నీటి గుర్రాన్ని చూడు. [QBR2] నేను (దేవుణ్ణి) నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) నేను చేశాను. [QBR2] నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది. [QBR]
16. నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది. [QBR2] దాని కడుపులోని కండరాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. [QBR]
17. నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా నిలుస్తుంది. [QBR2] దాని కాలి కండరాలు చాలా బలంగా ఉంటాయి. [QBR]
18. నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా ఉంటాయి. [QBR2] దాని కాళ్లు ఇనుప కడ్డీలా ఉంటాయి. [QBR]
19. నీటి గుర్రం నేను (దేవుణ్ణి) చేసిన మహా అద్భుత జంతువు. [QBR2] కాని నేను దానిని ఓడించగలను. [QBR]
20. అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద [QBR2] నీటి గుర్రం తినే గడ్డి పెరుగుతుంది. [QBR]
21. తామర చెట్ల కింద నీటి గుర్రం పండుకుంటుంది. [QBR2] జమ్ము గడ్డీ మడుగులలో నీటి గుర్రం దాక్కుంటుంది. [QBR]
22. తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని దాచిపెడతాయి. [QBR2] నది సమీపంగా పెరిగే నిరవంజి చెట్ల కింద అది నివసిస్తుంది. [QBR]
23. నది వరదలై పొర్లినా నీటి గుర్రం పారిపోదు. [QBR2] యొర్దాను నది దాని ముఖం మీద చిమ్మితే అది భయపడదు. [QBR]
24. నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో [QBR2] దానిని ఎవరూ పట్టుకొనలేరు. [PE]