1. “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా? [QBR2] దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా? [QBR]
2. యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు వేయగలవా? [QBR2] లేక దాని దవడకు గాలపు ముల్లు ఎక్కించగలవా? [QBR]
3. యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బతిమాలాడుతుందా? [QBR2] అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా? [QBR]
4. యోబూ, మొసలి నీతో ఒడంబడిక చేసు కుంటుందా? [QBR2] శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం చేస్తుందా? [QBR]
5. యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొన గలవా మొసలితో ఆడుకొ గలవా? [QBR2] నీ దాసీలు దానితో ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా? [QBR]
6. యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు ప్రయత్నిస్తారా? [QBR2] వారు దానిని వ్యాపారులకు అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా? [QBR]
7. యోబూ, మొసలి చర్మం మీదికి ఎన్నో శూలాలు నీవు విసరగలవా? [QBR2] లేక చేపలను వేటాడే అలుగులు అనేకం దాని తలమీద కొట్టగలవా?
8. “యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసలి మీద ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ మరచిపోలేవు. [QBR2] మరియు నీవు దానితో మరల ఎన్నటికీ పోరాడవు. [QBR]
9. ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే అది మరచిపో! [QBR2] అలాంటి ఆశ ఏమీ లేదు! [QBR2] దాన్ని చూస్తేనే నీకు భయం పుడుతుంది. [QBR]
10. మొసలికి కోపం పుట్టించగలిగినంత [QBR2] ధైర్యంగల మనిషి ఎవరూ లేరు. “కనుక అలాంటప్పుడు యోబూ, నాకువిరోధంగా నిలువగలవాడు ఎవడు? [QBR]
11. నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను. [QBR2] ఆకాశమంతటి క్రింద ఉన్న సర్వము నాదే.
12. “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం, [QBR2] దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను. [QBR]
13. మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు. [QBR2] ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు. [QBR]
14. మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు. [QBR2] దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి. [QBR]
15. మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు [QBR2] దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి. [QBR]
16. గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా [QBR2] ఆ పొలుసులు ఉంటాయి. [QBR]
17. ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి. [QBR2] వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి. [QBR]
18. మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది. [QBR2] దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి. [QBR]
19. దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి. [QBR2] నిప్పు కణాలు బయటకు లేస్తాయి. [QBR]
20. ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న [QBR2] పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది. [QBR]
21. మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది. [QBR2] దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి. [QBR]
22. “మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది. [QBR2] మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు. [QBR]
23. మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు. [QBR2] అది ఇనుములా గట్టిగా ఉంటుంది. [QBR]
24. మొసలి గుండె బండలా ఉంటుంది. [QBR2] దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి కింది రాయిలా గట్టిగా ఉంటుంది. [QBR]
25. మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు. [QBR2] మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు. [QBR]
26. ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి. [QBR2] ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు. [QBR]
27. మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక. [QBR2] ఇత్తడిని కుళ్లిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక. [QBR]
28. బాణలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు. [QBR2] దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి. [QBR]
29. దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది. [QBR2] మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది. [QBR]
30. మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది. [QBR2] అది నడిచి నప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది. [QBR]
31. కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగల పొంగిస్తుంది. [QBR2] నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది. [QBR]
32. మొసలి ఈ దినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది. [QBR2] అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది. [QBR]
33. భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు. [QBR2] అది భయం లేని జంతువుగా చేయబడింది. [QBR]
34. మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది. [QBR2] క్రూర జంతువులన్నిటికీ అది రాజు.” మరియు మొసలిని చేసినది నేనే, యెహోవాను. [PE]