1. యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంషుర్షణ ఉంది. [QBR2] అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది. [QBR]
2. ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి. [QBR2] జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి. [QBR]
3. అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడు తోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి. [QBR2] శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి. [QBR]
4. నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను, [QBR2] ‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ [QBR] అనే రాత్రి జరుగుతూనే ఉంటుంది. [QBR2] సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను. [QBR]
5. నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది. [QBR2] నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది.
6. “నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి. [QBR2] నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది. [QBR]
7. దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో. [QBR2] నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు. [QBR]
8. నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు. [QBR2] నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను. [QBR]
9. ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది. [QBR2] అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు. [QBR]
10. అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు. [QBR2] అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు.
11. “అందుచేత నేను మౌనంగా ఉండను. [QBR2] నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది. [QBR2] నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను. [QBR]
12. ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు? [QBR2] నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా? [QBR]
13. నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి [QBR2] నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి [QBR]
14. కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపె డుతున్నావు. [QBR2] దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు. [QBR]
15. అందుచేత బతకటం కంటె [QBR2] గొంతు నులుమి చంపబడటం నాకు మేలు. [QBR]
16. నా బదుకు నాకు అసహ్యం. [QBR2] నేను శాశ్వతంగా జీవించాలని కోరను [QBR] నన్ను ఒంటరిగా ఉండనివ్వు. [QBR2] నా జీవితానికి అర్థం శూన్యం. [QBR]
17. దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి? [QBR2] మనిషికి నీవసలు గుర్తింవు ఎందుకు ఇవ్వాలి? [QBR]
18. నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు, [QBR2] ప్రతిక్షణం ఎందుకు పరీక్షీస్తావు? [QBR]
19. దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు? [QBR2] ఒక క్షణమైన నీవు నన్ను, ఒంటరిగా ఉండనియ్యవు? [QBR]
20. మనుష్యులను గమనించువాడా, [QBR2] నేను పాపం చేశానంటావా, సరే మరి నన్నేం చేయమంటావు? [QBR] దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు? [QBR2] నేను నీకు ఒక భారమై పోయానా? [QBR]
21. నీవు నా తప్పిదాలు క్షమించి, [QBR2] నా పాపాలను ఎందుకు క్షమించకూడదు? [QBR] త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను. [QBR2] అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.” [PE]