1. {దెబోరా గీతం} [PS] ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున దెబోరా, అబీనోయము కుమారుడు బారాకు ఈ గీతం పాడారు:
2. “ఇశ్రాయేలు మనుష్యులు యుద్ధానికి సిద్ధమయ్యారు. [QBR2] యుద్ధానికి వెళ్లేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు. [QBR] యెహోవాను స్తుతించండి.
3. “రాజులారా, వినండి. [QBR2] అధికారులారా గమనించండి! [QBR] నేను పాడుతాను. [QBR2] నా మట్టుకు నేనే యెహోవాకు గానం చేస్తాను. [QBR] యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజల దేవునికి [QBR2] నేను సంగీతం గానం చేస్తాను.
4. “యెహోవా, గతంలో నీవు శేయీరు [*శేయీరు ఎదోము యొక్క మరో పేరు.] దేశం నుండి వచ్చావు. [QBR2] ఎదోము దేశం నుండి నీవు సాగిపోయావు. [QBR] నీవు నడువగా భూమి కంపించింది. [QBR2] ఆకాశాలు వర్షించాయి. [QBR2] మేఘాలు నీళ్లు కురిపించాయి. [QBR]
5. సీనాయి పర్వత దేవుడగు యెహోవా ఎదుట [QBR2] ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి.
6. “అనాతు కుమారుడు షమ్గరు [†షమ్గరు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి. న్యాయాధిపతులు 3:31 చూడండి.] రోజుల్లో యాయేలు రోజుల్లో, [QBR2] రహదారులు ఖాళీ అయ్యాయి. [QBR2] ప్రయాణీకుల ఒంటెలు వెనుక దారుల్లో వెళ్లాయి.
7. “దెబోరా, నీవు వచ్చేవరకు, [QBR2] ఇశ్రాయేలుకు నీవు ఒక తల్లిగా వచ్చేవరకు [QBR2] సైనికులు లేరు ఇశ్రాయేలులో సైనికులు లేరు.
8. “వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరుకొన్నారు. [QBR2] అందుచేత వారి పట్టణ ద్వారాల వద్ద వారు పోరాడవలసి వచ్చింది. [QBR] నలభైవేల మంది ఇశ్రాయేలు సైనికుల్లో [QBR2] ఎవరివద్దా ఒక డాలుగాని, బల్లెంగాని లేదు.
9. “నా హృదయం ఇశ్రాయేలు సైన్యాధికారులతోనే ఉంది. [QBR2] ఈ సైన్యాధికారులు ఇశ్రాయేలీయుల కోసం పోరాడేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు. [QBR] యెహోవాను స్తుతించండి!
10. “తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా, [QBR2] వాటి వీపు మీద తివాచీ [‡తివాచీ ఒక విధమైన రత్న కంబళి.] [QBR2] లపై కూర్చొనే ప్రజలారా, [QBR2] దారిలో ప్రయాణం చేసే ప్రజలారా గమనించండి! [QBR]
11. యెహోవా విజయాలను గూర్చి ఇశ్రాయేలీయుల మధ్య [QBR2] యెహోవా సైనికుల విజయాలను గూర్చి [QBR] యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల్లో పోరాడేందుకు వెళ్లినప్పటి విషయాలను గూర్చి [QBR2] పశువులు నీళ్లు త్రాగే చోట్ల తాళాల శబ్దాలతో వారు చెప్పుకొంటున్నారు.
12. “దెబోరా మేలుకో, మేలుకో! [QBR2] మేలుకో, మేలుకో, ఒక పాట పాడు! [QBR] బారాకూ లెమ్ము! [QBR2] అబీనోయము కుమారుడా, వెళ్లి, నీ శత్రువులను పట్టుకో!
13. “ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు. [QBR2] యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరకు వచ్చారు.
14. “అమాలేకు కొండ దేశంలో [QBR2] ఎఫ్రాయిము మనుష్యులు స్థిరపడ్డారు. [QBR] బెన్యామీనూ, ఆ మనుష్యులు నిన్నూ, [QBR2] నీ ప్రజలను వెంబడించారు. [QBR] మాకీరు కుటుంబ వంశంనుండి సైన్యాధికారులు దిగి వచ్చారు. [QBR2] జెబూలూను వంశం నుండి ఇత్తడి దండం పట్టి నడిపించు వారు వచ్చారు. [QBR]
15. ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు. [QBR2] ఇశ్శాఖారు వంశం వారు బారాకునకు నమ్మకంగా ఉన్నారు. [QBR2] ఆ మనుష్యులు లోయలోనికి కాలి నడకన సాగిపోయారు. “రూబేనీయులలో బహు గొప్పగా హృదయ పరిశోధన జరిగింది. [QBR]
16. అలాగైతే, మీరంతా గొర్రెల దొడ్ల గోడల వద్ద ఎందుకు కూర్చొన్నారు? [QBR] రూబేను, వారి సాహస సైనికులు యుద్ధం గూర్చి గట్టిగా తలచారు. [QBR2] కానీ వారు గొర్రెల కోసం వాయించిన సంగీతం వింటూ, ఇంటి వద్దనే కూర్చుండిపోయారు. [QBR]
17. గిలాదువారు యోర్దానుకు ఆవలివైపున వారి గుడారాల్లోనే ఉండిపోయారు. [QBR] దాను ప్రజలారా, [QBR2] మీరు మీ ఓడల దగ్గరే ఎందుకు ఉండిపోయారు? [QBR] ఆషేరు వంశం వారు సముద్ర తీరంలోనే ఉండిపోయారు. [QBR2] క్షేమ కరమైన ఓడ రేవుల్లోనే వారు ఉండి పోయారు.
18. “కానీ జెబూలూను మనుష్యులు [QBR2] నఫ్తాలి మనుష్యులు ఆ కొండల మీద పోరాడేందుకు వారి ప్రాణాలకు తెగించారు. [QBR]
19. రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు. [QBR2] కనాను రాజులు మెగిద్దో జలాల వద్ద తానాకు పట్టణం దగ్గర (కనాను రాజులు) యుద్ధం చేసారు. [QBR] కానీ వారు ఐశ్వర్యం ఏమీ ఇంటికి తీసుకుని పోలేదు. [QBR]
20. నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి. [QBR2] నక్షత్రాలు, వాటి మార్గం నుండి అవి సీసెరాతో పోరాడాయి. [QBR]
21. కీషోను నది ప్రాచీన నది. [QBR2] ఆ కీషోను నది సీసెరా మనుష్యులను తుడిచిపెట్టింది. [QBR] నా ప్రాణమా, బలము కలిగి ముందుకు సాగిపో. [QBR]
22. గుర్రాల డెక్కలు నేలను అదరగొట్టాయి. [QBR2] సీసెరా బలమైన గుర్రాలు పరుగులు తీసాయి.
23. “ ‘మేరోజు పట్టణాన్ని శపించండి’ [QBR] అని యెహోవా దూత చెప్పాడు. [QBR2] ‘వారు యెహోవాకు సహాయం చేసేందుకు, [QBR2] యెహోవాకు సైనికులను ఇచ్చేందుకు రాలేదు గనుక వారిని శపించండి.’ [QBR]
24. కనానీయుడైన హెబెరు భార్య యాయేలు. [QBR2] ఆమె స్త్రీలలో దీవెన నొందును. [QBR]
25. సీసెరా నీళ్లను అడిగెను. [QBR2] యాయేలు అతనికి పాలను ఇచ్చెను. [QBR] తరువాత సర్దారులకు తగిన పాత్రతో [QBR2] మీగడ తెచ్చియిచ్చెను. [QBR]
26. మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను. [QBR2] పనివారు ఉపయోగించు సుత్తెను కుడి చేత పట్టుకొనెను. [QBR] తరువాత మేకుతో అతని తలను పగులగొట్టెను. [QBR2] అప్పుడు సీసెరా కణత పగిలి అక్కడే పడిపోయెను. [QBR]
27. యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు [QBR2] అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు! [QBR] ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు. [QBR2] అతడు పడిపోయాడు! [QBR] సీసెరా ఎక్కడ పడ్డాడో [QBR2] అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!
28. “సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది. [QBR2] సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది, [QBR] ‘సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది? [QBR2] అతని రథం, గుర్రాల ధ్వనులు ఎందుకు ఆలస్యం అయ్యాయి.’
29. “ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు బవాబిస్తుంది. [QBR2] అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది. [QBR]
30. ‘నిశ్చయంగా వారు గెలిచారు! [QBR2] వారు ఓడించిన ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటున్నారు! [QBR] వారిలో వారు ఆ వస్తువులను పంచుకొంటున్నారు! [QBR2] ఒక్కో సైనికుడు ఒకరు లేక ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు. [QBR] ఒక వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క తీసుకుంటున్నాడేమో. [QBR2] అదీ సంగతి! విజయ శాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు కాబోలు.’
31. “యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక! [QBR2] కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!” [PS] ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది. [PE]