1. {దేవుడైన యెహోవా ఫిర్యాదు చేయడం} [PS] యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను [QBR] నీవు లేచి పర్వతాలముందు నిలబడు. [QBR2] వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి. [QBR]
2. తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది. [QBR2] పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి. [QBR] భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి. [QBR2] ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!
3. యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను? [QBR2] మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను? [QBR2] మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి! [QBR]
4. నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను! [QBR2] ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్ముల్ని నేను తీసుకువచ్చాను. [QBR] మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను. [QBR2] నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను. [QBR]
5. నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి. [QBR2] బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి [QBR] అకాసియ (షిత్తీయు) నుండి గిల్గాలువరుకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. [QBR2] అప్పుడు యెహోవా న్యాయ వరున్తుడని మీరు తెలుసుకుంటారు!” దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?
6. దేవుడైన యెహోవా సన్నధికి నేను వచ్చినప్పుడు, [QBR2] నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి? [QBR] ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను [QBR2] దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా? [QBR]
7. యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా, [QBR2] నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్నిబలి ఇవ్వనా? [QBR] నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో [QBR2] భాగంగా పుట్టిన శిశువును అర్పించనా?
8. మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు. [QBR2] యెహోవా నీ నుండి కోరేవి ఇవి: [QBR] ఇతరుల పట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు. [QBR2] ప్రజలపట్ల ప్రేమ, దయకలిగి ఉండటానికి ఇష్టపడు. [QBR2] అణకువ కలిగి నీ దేవునితో జీవించు. ఇశ్రాయేలీయులు ఏమి చేస్తున్నారు?
9. దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేము) పిలుస్తూవుంది. [QBR] తెలివిగల మనష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు. [QBR2] కావున శిక్షించే దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవాని పట్ల ధ్యానముంచు! [QBR]
10. దుష్టులు తాము దొంగిలించిన [QBR2] ధనరాశులను ఇంకా దాస్తున్నారా? [QBR] దుష్టులు ఇంకా మరీ చిన్నబట్టలతో [QBR2] జనాన్నిమోసగిస్తున్నారా? [QBR2] అలా ప్రజలను మోసగించే విధానాలను యెహోవా అసహ్యించు కుంటాడు! [QBR]
11. దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు, [QBR2] తప్పుడు తూనికలతో ప్రజలను మోసగిస్తున్నారా? [QBR] తప్పుడు కొలతలు కొలవటానికి వారింకా దొంగతూకపురాళ్లు, [QBR2] దొంగ కొలతలుగల సంచులు కలిగియున్నారా? [QBR2] అవును! అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి! [QBR]
12. ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు! [QBR2] ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు! [QBR2] అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు! [QBR]
13. కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను. [QBR2] నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను. [QBR]
14. నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు. [QBR2] నీ కడుపు ఖాళీగా ఉండి నీవు ఇంకా ఆకలితో ఉంటావు. [QBR] నీవు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి ప్రయత్నిస్తావు. [QBR2] కాని కత్తులు పట్టిన జనులు నీవు కాపాడిన జనులను చంపుతారు, నిన్ను పట్టుకుంటారు. [QBR]
15. నీవు విత్తనాలు చల్లుతావు; [QBR2] కానీ నీవు పంట కోయలేవు. [QBR] ఒలీవ గింజలను గానుగపడతావు; [QBR2] కానీ నీకు నూనెరాదు. [QBR] నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి [QBR2] నీవు అనుమతింపబడవు. [QBR]
16. ఎందకుంటే నీవు ఒమ్రీ [*ఒమ్రీ ఒక ఇశ్రాయేలు రాజు. అతడు తన ప్రజలు అబద్ధపు దేవుళ్లను ఆరాధించేలా చేశాడు. 1 రాజులు 16:21-26 చూడండి.] నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ, [QBR2] అహాబు వంశంవారు చేసిన చెడు పనులన్నీ చేస్తున్నావు. [QBR] నీవు వారి బోధలను పాటిస్తున్నావు. [QBR2] అందువల్ల నీవు నాశనమయ్యేలా చేస్తాను. [QBR] నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు. [QBR2] చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపోబడతారు. [PE]