పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
సంఖ్యాకాండము
1. {మిద్యానీయులను ఇశ్రాయేలీయులు తిప్పికొట్టడం} [PS] యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు:
2. “మిద్యానీయుల విషయం తేల్చేందుకు ఇశ్రాయేలీయులకు నేను సహాయం చేస్తాను. ఆ తర్వాత నీవు మరణిస్తావు.” [PE][PS]
3. కనుక మోషే ప్రజలతో మాట్లాడాడు. అతడు వారితో ఇలా చెప్పాడు: “మీ మనుష్యుల్లో కొందిరిని సైనికులుగా ఏర్పరచుకోండి. మిద్యానీయుల విషయం తేల్చేందుకు వారిని యెహోవా వాడుకొంటాడు.
4. ఇశ్రాయేలీయుల్లో ఒక్కోదాని నుండి 1,000 మందిని ఏర్పరచుకోండి.
5. ఇశ్రాయేలు వంశాలన్నింటినుండి మొత్తం 12,000 మంది సైనికులు ఉంటారు.” [PE][PS]
6. ఆ 12,000 మందిని మోషే యుద్ధానికి పంపించాడు. యాజకుడైన ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసును వారితో అతడు పంపాడు. పవిత్ర వస్తువుల్ని, కొమ్ములను, బూరలను ఎలీయాజరు తనతో తీసుకుని వెళ్లాడు.
7. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులతో పోరాడారు. మిద్యానీ మనుష్యులందరిని వారు చంపారు
8. వారు చంపిన వారిలో మిద్యాను రాజులు అయిదుగురు, ఎవీ, రేకెము, సూరు, హోరు, రేబ ఉన్నారు. బెయోరు కొడుకైన బిలామునుకూడ వారు ఖడ్గంతో చంపారు. [PE][PS]
9. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీ స్త్రీలను, పిల్లలను బందీలుగా పట్టుకొన్నారు. వారి గొర్రెలను, పశువులను, ఇతరమైన వాటిని అన్నింటినీ వారు తీసుకున్నారు.
10. అప్పుడు వారి గ్రామాలు, పట్టణాలన్నింటినీ వారు కాల్చివేసారు.
11. మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ వారు తీసుకుని
12. మోషే, యాజకుడైన ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయేలీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీయులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నదికి తూర్పున ఉంది.
13. అప్పుడు ఆ సైనికులను ఎదుర్కొనేందుకు మోషే, యాజకుడైన ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారంనుండి బయటకు వెళ్లారు. [PE][PS]
14. సైన్యాధిపతుల మీద మోషేకి చాల కోపం వచ్చింది. యుద్ధంనుండి తిరిగి వచ్చిన శతాధిపతుల మీద, సహస్రాధిపతులమీద అతనికి కోపం వచ్చింది.
15. మోషే వారితో అన్నాడు, “ఆ స్త్రీలను మీరెందుకు బ్రతకనిచ్చారు?
16. ఈ స్త్రీలు ఇశ్రాయేలు పురుషులకు తగరు. యెహోవానుండి ప్రజలు తిరిగి పోతారు. అది బిలాము కాలంలాగే ఉంటుంది. బయలు పెయోరు దగ్గర జరిగినట్టే జరుగుతుంది. ఆ రోగం యెహోవా ప్రజలకు మళ్లీ వస్తుంది.
17. ఇప్పుడు మిద్యానీ బాలురను అందరినీ చంపివేయండి. పురుషునితో కాపురం చేసిన ప్రతి మిద్యానీ స్త్రీని చంపివేయండి. పురుష సంయోగం ఎరిగిన మిద్యానీ స్త్రీలలో ప్రతి ఒక్కరినీ చంపేయండి.
18. ఏ పురుషునితోనూ ఎన్నడూ లైంగిక సంబంధంలేని స్త్రీలను మీరు బ్రతకనివ్వవచ్చును.
19. తర్వాత, ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసానికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని ముట్టినాసేరే నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి.
20. ఏడో రోజున మళ్లీ మీరు అలాగే చేయాలి. మీ బట్టలు అన్నీ మీరు ఉదుక్కోవాలి. తోలు, ఉన్ని, కట్టెతో చేయబడిన వాటిని అన్నింటినీ మీరు కడగాలి. మీరు తప్పక పవిత్రం కావాలి.” [PE][PS]
21. అప్పుడు యాజకుడైన ఎలీయాజరు సైనికులతో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “అవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. యుద్ధంనుండి తిరిగి వచ్చే సైనికులకోసం ఈ ఆజ్ఞలు.
22. (22-23) అయితే అగ్నిలో వెయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి.
23.
24. ఏడో రోజున తప్పక మీరు మీ వస్త్రాలను ఉదుక్కోవాలి. అప్పుడు మీరు పవిత్రం అవుతారు. ఆ తర్వాత మీరు నివాసంలోకి రావచ్చును.” [PE][PS]
25. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
26. “సైనికులు యుద్ధంలో పట్టుకొన్న బందీలను, జంతువులను, సామగ్రి అతటినీ, నీవూ, యాజకుడైన ఎలీయాజరూ, నాయకులందరూ లెక్కపెట్టాలి.
27. తర్వాత వాటిని యుద్ధానికి వెళ్లిన సైనికులు, మిగిలిన ఇశ్రాయేలు ప్రజల మధ్య పంచుకోవాలి.
28. యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం తీసుకో. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నింటిలోను ఇలాగే.
29. యుద్ధంలో సైనికలు తెచ్చిన వాటిలోని వారి సగభాగంనుండి వాటిని తీసుకో. అప్పుడు వాటిని యాజకుడైన ఎలీయాజరుకు ఇవ్వవలెను. ఆ భాగం యెహోవాకు చెందుతుంది.
30. ఆ తర్వాత ప్రజల సగభాగంలో ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం లేవీయులకు ఇవ్వవలెను. (ఎందుచేతనంటే యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు తీసుకొన్నారు గనుక.)” [PE][PS]
31. కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఎలీయాజరు చేసారు.
32. సైనికులు 6,75,000 గొర్రెలను,
33. 72,000 పశువులను
34. 61,000 గాడిదలను,
35. 32,000 మంది స్త్రీలను తీసుకున్నారు. (వారు ఏ పురుషునితోనూ లైంగిక సంబంధం లేని వారు మాత్రమే.)
36. యుద్ధానికి వెళ్లిన సైనికులకు 3,37,500 గొర్రెలు వచ్చాయి.
37. 675 గొర్రెలను వారు యెహోవాకు ఇచ్చారు.
38. సైనికులకు 36,000 పశువులు వచ్చాయి. 72 పశువులును వారు యెహోవాకు ఇచ్చారు.
39. సైనికులకు 30,500 గాడిదలు వచ్చాయి. 61 గాడిదలను వారు యెహోవాకు ఇచ్చారు.
40. సైనికుల వంతు 16,000 మంది స్త్రీలు. 32 మంది స్త్రీలను వారు యెహోవాకు ఇచ్చారు.
41. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఆ కానుకలన్నింటిని యెహోవా కోసం యాజకుడైన ఎలీయాజరుకు మోషే ఇచ్చాడు. [PE][PS]
42. అప్పుడు మెషే ప్రజల అర్ధ భాగాన్ని లెక్కించాడు. యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర మోషే తీసుకున్న ప్రజల భాగం ఇది.
43. 3,37,500 గొర్రెలు
44. 36,000 పశువులు,
45. 30,500 గాడిదలు
46. 16,000 మంది స్త్రీలు ప్రజల వంతు.
47. ప్రతి 50 లోంచి ఒకటి యెహోవాకోసం మోషే తీసుకున్నాడు. జంతువులు, మనుష్యుల్లో కూడ ఇలాగే. అప్పుడు అతడు వాటిని లేవీయులకు ఇచ్చాడు. ఎందుచేతనంటే వారు యెహోవా పవిత్ర గుడారం విషయమై బాధ్యత వహించారు గనుక. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇలా చేసాడు. [PE][PS]
48. అప్పుడు సైన్యాధికారులు మోషే దగ్గరకు వచ్చారు (1,000 మంది మీద అధికారులు, 100 మంది మీద అధికారులు.)
49. వారు మోషేతో చెప్పారు, “నీ సేవకులమైన మేము మా సైనికులను లెక్కించాము. వారిలో ఎవరినీ మేము విడిచిపెట్టలేదు.
50. కనుక ప్రతి సైనికుని దగ్గర్నుండీ యెహోవా కానుకను మేము తెస్తున్నాము. బంగారంతో చేయబడిన దండపతకాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు మేము తెస్తున్నాము. మా పాపాలను కప్పేందుకు ఇది యెహోవాకు కానుక.” [PE][PS]
51. కనుక బంగారంతో చేయబడిన ఆ వస్తువులన్నిటినీ మోషే తీసుకొని యాజకుడైన ఎలీయాజరుకు ఇచ్చాడు.
52. 1,000 మందిపైనున్న నాయకులు, 100 మందిపైనున్న నాయకులు యెహోవాకు ఇచ్చిన మొత్తం బంగారం బరువు 420 పౌన్లు.
53. సైనికులు యుద్ధంలో తీసుకొన్న మిగిలిన వస్తువులను వారు ఉంచుకొన్నారు.
54. 1,000 మందిపైనున్న, 100 మందిపైనున్న అధికారుల దగ్గర బంగారాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరూ తీసుకున్నారు. తర్వాత ఆ బంగారాన్ని సన్నిధి గుడారంలో వారు ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఎదుట ఈ కానుక ఒక జ్ఞాపక చిహ్నం. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 36 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 31 / 36
సంఖ్యాకాండము 31:64
మిద్యానీయులను ఇశ్రాయేలీయులు తిప్పికొట్టడం 1 యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: 2 “మిద్యానీయుల విషయం తేల్చేందుకు ఇశ్రాయేలీయులకు నేను సహాయం చేస్తాను. ఆ తర్వాత నీవు మరణిస్తావు.” 3 కనుక మోషే ప్రజలతో మాట్లాడాడు. అతడు వారితో ఇలా చెప్పాడు: “మీ మనుష్యుల్లో కొందిరిని సైనికులుగా ఏర్పరచుకోండి. మిద్యానీయుల విషయం తేల్చేందుకు వారిని యెహోవా వాడుకొంటాడు. 4 ఇశ్రాయేలీయుల్లో ఒక్కోదాని నుండి 1,000 మందిని ఏర్పరచుకోండి. 5 ఇశ్రాయేలు వంశాలన్నింటినుండి మొత్తం 12,000 మంది సైనికులు ఉంటారు.” 6 ఆ 12,000 మందిని మోషే యుద్ధానికి పంపించాడు. యాజకుడైన ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసును వారితో అతడు పంపాడు. పవిత్ర వస్తువుల్ని, కొమ్ములను, బూరలను ఎలీయాజరు తనతో తీసుకుని వెళ్లాడు. 7 యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులతో పోరాడారు. మిద్యానీ మనుష్యులందరిని వారు చంపారు 8 వారు చంపిన వారిలో మిద్యాను రాజులు అయిదుగురు, ఎవీ, రేకెము, సూరు, హోరు, రేబ ఉన్నారు. బెయోరు కొడుకైన బిలామునుకూడ వారు ఖడ్గంతో చంపారు. 9 ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీ స్త్రీలను, పిల్లలను బందీలుగా పట్టుకొన్నారు. వారి గొర్రెలను, పశువులను, ఇతరమైన వాటిని అన్నింటినీ వారు తీసుకున్నారు. 10 అప్పుడు వారి గ్రామాలు, పట్టణాలన్నింటినీ వారు కాల్చివేసారు. 11 మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ వారు తీసుకుని 12 మోషే, యాజకుడైన ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయేలీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీయులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నదికి తూర్పున ఉంది. 13 అప్పుడు ఆ సైనికులను ఎదుర్కొనేందుకు మోషే, యాజకుడైన ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారంనుండి బయటకు వెళ్లారు. 14 సైన్యాధిపతుల మీద మోషేకి చాల కోపం వచ్చింది. యుద్ధంనుండి తిరిగి వచ్చిన శతాధిపతుల మీద, సహస్రాధిపతులమీద అతనికి కోపం వచ్చింది. 15 మోషే వారితో అన్నాడు, “ఆ స్త్రీలను మీరెందుకు బ్రతకనిచ్చారు? 16 ఈ స్త్రీలు ఇశ్రాయేలు పురుషులకు తగరు. యెహోవానుండి ప్రజలు తిరిగి పోతారు. అది బిలాము కాలంలాగే ఉంటుంది. బయలు పెయోరు దగ్గర జరిగినట్టే జరుగుతుంది. ఆ రోగం యెహోవా ప్రజలకు మళ్లీ వస్తుంది. 17 ఇప్పుడు మిద్యానీ బాలురను అందరినీ చంపివేయండి. పురుషునితో కాపురం చేసిన ప్రతి మిద్యానీ స్త్రీని చంపివేయండి. పురుష సంయోగం ఎరిగిన మిద్యానీ స్త్రీలలో ప్రతి ఒక్కరినీ చంపేయండి. 18 ఏ పురుషునితోనూ ఎన్నడూ లైంగిక సంబంధంలేని స్త్రీలను మీరు బ్రతకనివ్వవచ్చును. 19 తర్వాత, ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసానికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని ముట్టినాసేరే నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి. 20 ఏడో రోజున మళ్లీ మీరు అలాగే చేయాలి. మీ బట్టలు అన్నీ మీరు ఉదుక్కోవాలి. తోలు, ఉన్ని, కట్టెతో చేయబడిన వాటిని అన్నింటినీ మీరు కడగాలి. మీరు తప్పక పవిత్రం కావాలి.” 21 అప్పుడు యాజకుడైన ఎలీయాజరు సైనికులతో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “అవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. యుద్ధంనుండి తిరిగి వచ్చే సైనికులకోసం ఈ ఆజ్ఞలు. 22 (22-23) అయితే అగ్నిలో వెయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి. 23 24 ఏడో రోజున తప్పక మీరు మీ వస్త్రాలను ఉదుక్కోవాలి. అప్పుడు మీరు పవిత్రం అవుతారు. ఆ తర్వాత మీరు నివాసంలోకి రావచ్చును.” 25 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 26 “సైనికులు యుద్ధంలో పట్టుకొన్న బందీలను, జంతువులను, సామగ్రి అతటినీ, నీవూ, యాజకుడైన ఎలీయాజరూ, నాయకులందరూ లెక్కపెట్టాలి. 27 తర్వాత వాటిని యుద్ధానికి వెళ్లిన సైనికులు, మిగిలిన ఇశ్రాయేలు ప్రజల మధ్య పంచుకోవాలి. 28 యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం తీసుకో. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నింటిలోను ఇలాగే. 29 యుద్ధంలో సైనికలు తెచ్చిన వాటిలోని వారి సగభాగంనుండి వాటిని తీసుకో. అప్పుడు వాటిని యాజకుడైన ఎలీయాజరుకు ఇవ్వవలెను. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. 30 ఆ తర్వాత ప్రజల సగభాగంలో ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం లేవీయులకు ఇవ్వవలెను. (ఎందుచేతనంటే యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు తీసుకొన్నారు గనుక.)” 31 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఎలీయాజరు చేసారు. 32 సైనికులు 6,75,000 గొర్రెలను, 33 72,000 పశువులను 34 61,000 గాడిదలను, 35 32,000 మంది స్త్రీలను తీసుకున్నారు. (వారు ఏ పురుషునితోనూ లైంగిక సంబంధం లేని వారు మాత్రమే.) 36 యుద్ధానికి వెళ్లిన సైనికులకు 3,37,500 గొర్రెలు వచ్చాయి. 37 675 గొర్రెలను వారు యెహోవాకు ఇచ్చారు. 38 సైనికులకు 36,000 పశువులు వచ్చాయి. 72 పశువులును వారు యెహోవాకు ఇచ్చారు. 39 సైనికులకు 30,500 గాడిదలు వచ్చాయి. 61 గాడిదలను వారు యెహోవాకు ఇచ్చారు. 40 సైనికుల వంతు 16,000 మంది స్త్రీలు. 32 మంది స్త్రీలను వారు యెహోవాకు ఇచ్చారు. 41 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఆ కానుకలన్నింటిని యెహోవా కోసం యాజకుడైన ఎలీయాజరుకు మోషే ఇచ్చాడు. 42 అప్పుడు మెషే ప్రజల అర్ధ భాగాన్ని లెక్కించాడు. యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర మోషే తీసుకున్న ప్రజల భాగం ఇది. 43 3,37,500 గొర్రెలు 44 36,000 పశువులు, 45 30,500 గాడిదలు 46 16,000 మంది స్త్రీలు ప్రజల వంతు. 47 ప్రతి 50 లోంచి ఒకటి యెహోవాకోసం మోషే తీసుకున్నాడు. జంతువులు, మనుష్యుల్లో కూడ ఇలాగే. అప్పుడు అతడు వాటిని లేవీయులకు ఇచ్చాడు. ఎందుచేతనంటే వారు యెహోవా పవిత్ర గుడారం విషయమై బాధ్యత వహించారు గనుక. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇలా చేసాడు. 48 అప్పుడు సైన్యాధికారులు మోషే దగ్గరకు వచ్చారు (1,000 మంది మీద అధికారులు, 100 మంది మీద అధికారులు.) 49 వారు మోషేతో చెప్పారు, “నీ సేవకులమైన మేము మా సైనికులను లెక్కించాము. వారిలో ఎవరినీ మేము విడిచిపెట్టలేదు. 50 కనుక ప్రతి సైనికుని దగ్గర్నుండీ యెహోవా కానుకను మేము తెస్తున్నాము. బంగారంతో చేయబడిన దండపతకాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు మేము తెస్తున్నాము. మా పాపాలను కప్పేందుకు ఇది యెహోవాకు కానుక.” 51 కనుక బంగారంతో చేయబడిన ఆ వస్తువులన్నిటినీ మోషే తీసుకొని యాజకుడైన ఎలీయాజరుకు ఇచ్చాడు. 52 1,000 మందిపైనున్న నాయకులు, 100 మందిపైనున్న నాయకులు యెహోవాకు ఇచ్చిన మొత్తం బంగారం బరువు 420 పౌన్లు. 53 సైనికులు యుద్ధంలో తీసుకొన్న మిగిలిన వస్తువులను వారు ఉంచుకొన్నారు. 54 1,000 మందిపైనున్న, 100 మందిపైనున్న అధికారుల దగ్గర బంగారాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరూ తీసుకున్నారు. తర్వాత ఆ బంగారాన్ని సన్నిధి గుడారంలో వారు ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఎదుట ఈ కానుక ఒక జ్ఞాపక చిహ్నం.
మొత్తం 36 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 31 / 36
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References