1. యెహోవా నీవెందుకు అంత దూరంగా ఉంటావు? [QBR2] కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు. [QBR]
2. గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు. [QBR2] మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు. [QBR]
3. దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయ పడతారు. [QBR2] లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు. [QBR]
4. ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవుని అనుసరించరు. [QBR2] వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు. [QBR]
5. ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు. [QBR2] కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు. [QBR2] దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు. [QBR]
6. వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు. [QBR2] “మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు. [QBR]
7. ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు. [QBR2] దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు. [QBR]
8. ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు. [QBR2] ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు. [QBR2] నిర్దోషులను వారు చంపుతారు. [QBR]
9. తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు. [QBR2] ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు. [QBR]
10. పేదలను, బాధపడేవారిని, [QBR2] ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు. [QBR]
11. అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు! [QBR2] దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు! [QBR2] మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!”
12. యెహోవా, లేచి ఏదైనా చేయుము! [QBR2] దేవా, దుష్టులను శిక్షించుము! [QBR2] పేదలను మాత్రం మరువ కుము!
13. దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు? [QBR2] ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక. [QBR]
14. యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు. [QBR2] నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము. [QBR] ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు. [QBR2] యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము.
15. యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము. [QBR]
16. యెహోవా నిరంతరం రాజైయున్నాడు. [QBR2] ఆ ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక! [QBR]
17. యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి నీవు విన్నావు. [QBR2] నీవు వారిని ప్రోత్సాహ పరచెదవు. వారి ప్రార్థనలు ఆలకించెదవు. [QBR]
18. యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము. [QBR2] దుర్మార్గులు ఇక్కడ ఉండ కుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము. [PE]