1. యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. [QBR2] ఆయన ప్రేమ శాశ్వతం. [QBR]
2. యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి. [QBR2] వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి. [QBR]
3. అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు. [QBR2] తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల [*దక్షిణం అక్షరార్థంగా హీబ్రూలో ‘సముద్రము’ అని ఉంది. కానీ ఒక చిన్న మార్పు ఏమంటే అది దక్షిణ.] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
4. ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు. [QBR2] వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుతున్నారు. [QBR2] కానీ వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు. [QBR]
5. ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి [QBR2] బలహీనం అయ్యారు. [QBR]
6. అప్పుడు వారు సహాయం కోసం యెహోవాకు ఏడ్చి, మొరపెట్టి వేడుకొన్నారు. [QBR2] యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు. [QBR]
7. ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. [QBR]
8. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి! [QBR2] ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. [QBR]
9. దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. [QBR2] ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు. [QBR]
10. దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో [QBR2] కటకటాల వెనుక ఖైదీలుగా ఉన్నారు. [QBR]
11. ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు. [QBR2] సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు. [QBR]
12. ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా [QBR2] దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు. [QBR] వారు తొట్రిల్లి, పడిపోయారు. [QBR2] మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు. [QBR]
13. ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. [QBR2] వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు. [QBR]
14. దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు. [QBR2] మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు. [QBR]
15. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. [QBR2] ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. [QBR]
16. దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము. [QBR] వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు. [QBR2] వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు.
17. కొందరు ప్రజలు తమ తిరుగూబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు. [QBR2] మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు. [QBR]
18. ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు, [QBR2] వారు చావుకు సమీపించారు. [QBR]
19. వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. [QBR2] యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు. [QBR]
20. దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. [QBR2] కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు. [QBR]
21. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. [QBR2] ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. [QBR]
22. యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి. [QBR2] యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.
23. కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు. [QBR2] వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు. [QBR]
24. ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు. [QBR2] సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు. [QBR]
25. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది. [QBR2] అలలు అంతకంతకు పెద్దవయ్యాయి. [QBR]
26. అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి. [QBR] తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు. [QBR2]
27. ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడి పోతున్నారు. [QBR2] నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం. [QBR]
28. వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు. [QBR2] మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు. [QBR]
29. దేవుడు తుఫానును ఆపివేసి, [QBR2] అలలను నెమ్మది పర్చాడు. [QBR]
30. సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు. [QBR2] వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు. [QBR]
31. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. [QBR2] ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. [QBR]
32. మహా సమాజంలో యెహోవాను స్తుతించండి. [QBR2] పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
33. దేవుడు నదులను ఎడారిగా మార్చాడు. [QBR2] నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు. [QBR]
34. సారవంతమైన భూమిని పనికి మాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు. [QBR2] ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే. [QBR]
35. దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు. [QBR2] ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు. [QBR]
36. దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు. [QBR2] ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు. [QBR]
37. ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు. [QBR2] వారికి మంచి పంట వచ్చింది. [QBR]
38. దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి. [QBR2] వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి. [QBR]
39. విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు [QBR2] చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి. [QBR]
40. దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు. [QBR2] బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు. [QBR]
41. అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు. [QBR2] ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి. [QBR]
42. మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు. [QBR2] కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు. [QBR]
43. ఒక వ్యక్తి తెలివిగలవాడైతే అతడు ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు. [QBR2] ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు. [PE]