పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
కీర్తనల గ్రంథము
1. యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
2. ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు. మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
3. ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు. అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
4. మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు. దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
5. ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చేగుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
6. ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు. ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడుతాడు.
7. మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు. ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
8. ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు. అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
9. ఆమనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10. దుష్టులిది చూచి కోపగిస్తారు. వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు. దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 112 of Total Chapters 150
కీర్తనల గ్రంథము 112:31
1. యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
2. మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు. మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
3. వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు. అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
4. మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు. దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
5. ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చేగుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
6. మనిషి ఎన్నటికీ పడిపోడు. ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడుతాడు.
7. మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు. మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
8. మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు. అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
9. ఆమనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10. దుష్టులిది చూచి కోపగిస్తారు. వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు. దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.
Total 150 Chapters, Current Chapter 112 of Total Chapters 150
×

Alert

×

telugu Letters Keypad References