పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. [QBR2] దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను. [QBR]
2. దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను. [QBR2] నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను. [QBR] నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు. [QBR]
3. దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. [QBR2] నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4. యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక! [QBR2] నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు. [QBR]
5. ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను. [QBR2] యెహోవా మహిమ గొప్పది. [QBR]
6. దేవుడు గొప్పవాడు. [QBR2] అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు. [QBR] గర్వష్టులు చేసే పనులు యెహోవాకు తెలుసు. [QBR2] కానీ ఆయన వారికి సన్ని హితంగా ఉండడు. [QBR]
7. దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బతికించుము. [QBR2] నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము. [QBR]
8. యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము. [QBR2] యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. [QBR] యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 138 / 150
కీర్తనల గ్రంథము 138:64
1 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను. 2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను. నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను. నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు. 3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు. 4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక! నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు. 5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను. యెహోవా మహిమ గొప్పది. 6 దేవుడు గొప్పవాడు. అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు. గర్వష్టులు చేసే పనులు యెహోవాకు తెలుసు. కానీ ఆయన వారికి సన్ని హితంగా ఉండడు. 7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము. 8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 138 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References