1. యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. [QBR2] నన్ను గూర్చి నీకు అంతా తెలుసు. [QBR]
2. నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. [QBR2] దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు. [QBR]
3. యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు. [QBR2] నేను చేసే ప్రతీది నీకు తెలుసు. [QBR]
4. యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే [QBR2] నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు. [QBR]
5. యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు. [QBR2] నీవు నెమ్మదిగా నీ చేయినామీద వేస్తావు. [QBR]
6. నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. [QBR2] గ్రహించటం నాకు కష్టతరం. [QBR]
7. నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, [QBR2] నేను నీ నుండి తప్పించుకోలేను. [QBR]
8. నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. [QBR2] పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు. [QBR]
9. యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు. [QBR2] పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు. [QBR]
10. అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, [QBR2] ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
11. యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే, [QBR2] “పగలు రాత్రిగా మారిపోయింది. [QBR2] తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు [QBR]
12. కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు. [QBR2] రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది. [QBR]
13. యెహోవా, నా శరీరమంతటినీ [*శరీరము అక్షరార్థంగా మూత్రపిండాలు. ప్రాచీన ఇశ్రాయేలీయులు ఉద్రేకములు మూత్ర పిండాల్లో కేంద్రీకృతమైయున్నవని తలంచేవాళ్లు. గనుక ఈ వ్యక్తి తను పుట్టుటకు ముందే ఎలా అనుభవాన్ని పొందాడో అని దేవునికి తెలుసు అనే అర్థము కూడా వుండవచ్చు.] నీవు చేశావు. [QBR2] నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు. [QBR]
14. యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. [QBR2] నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15. నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు నా తల్లి గర్భంలో దాగి ఉండి, [QBR2] నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు. [QBR]
16. యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు. [QBR2] ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు. [QBR]
17. దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం. [QBR2] నీకు ఎంతో తెలుసు. [QBR]
18. వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి. [QBR2] కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
19. దేవా, దుర్మార్గులను చంపివేయుము. [QBR] ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము. [QBR2]
20. ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు. [QBR2] వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు. [QBR]
21. యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను. [QBR2] నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను. [QBR]
22. నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను! [QBR2] నీ శత్రువులు నాకూ శత్రువులే. [QBR]
23. యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము. [QBR2] నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము. [QBR]
24. చూచి నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము. [QBR2] శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము. [PE]