1. యెహోవాను స్తుతించండి! [QBR] పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి! [QBR]
2. సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! [QBR2] ఆయన సర్వ సైనికులారా [*ఆయన సర్వ సైనికులారా అనగా “దేవదూతలు” లేదా “నక్షత్రాలు మరియు గ్రహాలు” లేదా “సైనికులు” అని అర్థము.] ఆయనను స్తుతించండి! [QBR]
3. సూర్యచంద్రులారా యెహోవాను స్తుతించండి. [QBR2] ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి! [QBR]
4. మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి. [QBR2] ఆకాశం పైగా ఉన్న జలములారా ఆయనను స్తుతించండి. [QBR]
5. యెహోవా నామాన్ని స్తుతించండి. [QBR2] ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది. [QBR]
6. ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు. [QBR2] ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు. [QBR]
7. భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు! [QBR2] మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా యెహోవాను స్తుతించండి. [QBR]
8. అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, [QBR2] తుఫాను గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు. [QBR]
9. పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను, [QBR2] దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు. [QBR]
10. అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు. [QBR]
11. భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు. [QBR2] నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు. [QBR]
12. యువతీ యువకులను దేవుడు చేశాడు. [QBR2] వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు. [QBR]
13. యెహోవా నామాన్ని స్తుతించండి! [QBR2] ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! [QBR] భూమిపైన, ఆకాశంలోను ఉన్న [QBR2] సమస్తం ఆయనను స్తుతించండి! [QBR]
14. దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు. [QBR2] దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు. [QBR] ఎవరి పక్షంగా ఆయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి! [PE]