1. యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది? [QBR2] ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు? [QBR]
2. యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు, [QBR2] వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు. [QBR]
3. “దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం. [QBR2] మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.
4. కాని నా ప్రభువా, పరలోకంలో ఉన్న రాజు [QBR2] ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు. [QBR]
5. (5-6) దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు: [QBR2] “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను. [QBR] అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.” [QBR2] మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.
6.
7. యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను. [QBR] యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను! [QBR2] మరియు నీవు నా కుమారుడివి. [QBR]
8. నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను. [QBR2] భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు! [QBR]
9. ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు [QBR2] ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”
10. అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి. [QBR2] పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి. [QBR]
11. అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి. [QBR]
12. మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి [*దేవుని … చూపించండి అక్షరార్థం కుమారునికి ముద్దు పెట్టుకోండి.] [QBR2] మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు. [QBR] యెహోవాయందు విశ్వసం ఉంచేవారు సంతోషిస్తారు. [QBR2] కానీ ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. [PE]