1. నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక. యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక .
|
3. నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక. నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
|
4. నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
|
5. దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదముగాక. దేవుని నామమునకు. స్తొత్రము క లుగును గాక. నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
|
6. ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయర చేస్తాడని నాకు తెలుసు. దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు. ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయెగించాడు.
|
7. కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు మనుష్యులు వారి గుర్రాలను నమ్ముకొంటారు. కానీ మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
|
8. ఆ ఇతర మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు. కానీ మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
|