1. నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? [QBR2] నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. [QBR2] సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. [QBR]
2. నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను. [QBR2] కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు. [QBR] మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.
3. దేవా, నీవు పవిత్రుడవు. [QBR2] నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహసనం. [QBR]
4. మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. [QBR2] అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు. [QBR]
5. మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువులు నుంచి వారు తప్పించుకొన్నారు. [QBR2] వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు. [QBR]
6. అందుచేత నేను మనిషిని కానా, పురుగునా? [QBR2] మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు. [QBR]
7. నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు. [QBR2] నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు. [QBR]
8. వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి. [QBR2] ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో! [QBR2] నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”
9. దేవా, నిజంగా నేను నీ మీద ఆధార పడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగిన వాడవు నీవే. [QBR2] నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు. [QBR]
10. నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు. [QBR2] నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటి నుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.
11. కనుక దేవా, నన్ను విడువకు. [QBR2] కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసే వారు. ఎవ్వరూ లేరు. [QBR]
12. మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు. [QBR2] వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు. [QBR2] (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్దికెక్కిన ప్రాంతం.) [QBR]
13. ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు. [QBR2] వారి నోళ్లు పెద్దగా తెరచు కొని ఉన్నాయి.
14. నేలమీద పోయబడ్డ నీళ్లలా [QBR2] నా బలం పోయినది. [QBR] నా ఎముకలు విడిపోయాయి. [QBR2] నా ధైర్యం పోయినది. [QBR]
15. నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది. [QBR2] నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది. [QBR2] “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు. [QBR]
16. “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి. [QBR2] ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది. [QBR2] సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు. [QBR]
17. నేను నా ఎముకల్ని చూడగలను. [QBR2] ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు. [QBR2] వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు! [QBR]
18. ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. [QBR2] నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.
19. యెహోవా, నన్ను విడువకుము! [QBR2] నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము! [QBR]
20. యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము. [QBR2] ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము. [QBR]
21. సింహం నోటినుండి నన్ను రక్షించుము. [QBR2] ఆబోతుకొమ్ములనుండి నన్ను కాపాడుము.
22. యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను. [QBR2] ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. [QBR]
23. యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి. [QBR2] ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవాను ఘనపర్చండి. [QBR2] ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి. [QBR]
24. ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. [QBR2] ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు. [QBR2] యెహోవా వారిని ద్వేషించడు. [QBR2] ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
25. యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నీ నుండే వస్తుంది. [QBR2] నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను. [QBR]
26. పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు. [QBR2] యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి. [QBR2] మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక! [QBR]
27. దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని [QBR2] ఆయన వద్దకు తిరిగి వస్తారు. [QBR]
28. ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. [QBR2] ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు. [QBR]
29. నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు. [QBR2] సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తలవంచు తారు. [QBR] మరియు వారి ప్రాణాలను కాపాడుకొన లేనివారు కూడా తల వంచుతారు. [QBR2] చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తలవంచాలి. [QBR]
30. భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు. [QBR2] యెహోవా విషయమై వారు, నిత్యం చెప్పుతారు. [QBR]
31. ఇంకా పుట్టని మనుష్యులకు వచ్చి దేవుని మంచి తనం గూర్చి చెబుతారు. [QBR2] దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు. [PE]