2. యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
|
3. యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు. మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
|
5. యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టును. లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
|
6. లెబనోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి. షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
|
9. యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
|