1. యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు. నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
|
3. సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు. నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ ఉండవలసిన పనిలేదు.
|
5. దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది కానీ ఆయన తన ప్రేమను చూపించాడు. నాకు “జీవం” ప్రసాదించాడు. రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను. మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
|
7. యెహోవా, నీవు నామీద దయ చూపావు. బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు. కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు. మరి నేను చాలా భయపడిపోయాను.
|
9. “దేవా, నేను మరణించి సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం? ధూళి నిన్ను స్తుతిస్తుందా? అది నీ నమ్మకమును గూర్చి చెప్పుతుందా?
|
11. నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.. నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు. నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
|
12. యెహోవా, నా దేవా నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను. ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
|