1. యెహోవా, నీవే నా కాపుదల. [QBR2] నన్ను నిరాశపరచవద్దు. [QBR2] నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము. [QBR2]
2. దేవా నా మాట ఆలకించుము. [QBR2] వేగంగా వచ్చి నన్ను రక్షించి [QBR] నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము. [QBR2] నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము. [QBR]
3. దేవా, నీవే నా బండవు, కోటవు [QBR2] కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము. [QBR]
4. నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు. [QBR2] వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం. [QBR]
5. యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు. [QBR2] నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను. [QBR2] నన్ను రక్షించుము. [QBR]
6. వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం. [QBR2] యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను. [QBR]
7. దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది. [QBR2] నా కష్టాలు నీవు చూశావు. [QBR2] నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు. [QBR]
8. నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు. [QBR2] వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు. [QBR]
9. యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉచుము. [QBR2] నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి. [QBR2] నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి. [QBR]
10. నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది. [QBR2] నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. [QBR] నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నయి. [QBR2] నా బలం తొలగిపోతుంది. [*నా … తొలగిపోతుంది అక్షరాలా ఎముకలు క్షీణిస్తున్నాయి.] [QBR]
11. నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు. [QBR2] నా పొరుగు వాళ్లంతా నన్ను కూడా ద్వేషిస్తారు. [QBR] నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు. [QBR2] వారు నానుండి దూరంగా ఉంటారు. [QBR]
12. నేను ఏదో పోయిన పనిముట్టులా ఉన్నాను. [QBR2] నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు. [QBR]
13. ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను. [QBR2] ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.
14. యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. [QBR2] నీవే నా దేవుడవు. [QBR]
15. నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. [QBR2] నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. [QBR]
16. దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము. [QBR2] నన్ను రక్షించుము. [QBR]
17. యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను. [QBR2] కనుక నేను నిరాశచెందను. [QBR] చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు, [QBR2] మౌనంగా వారు సమాధికి వెళ్తారు. [QBR]
18. ఆ చెడ్డవాళ్లు గర్వించి, [QBR2] మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబతారు. [QBR] ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు. [QBR2] కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.
19. దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు. [QBR2] నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు. [QBR]
20. మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు. [QBR2] ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు. [QBR2] కానీ ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు. [QBR]
21. యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు. [QBR2] ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు. [QBR]
22. నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను. [QBR2] కానీ దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.
23. దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి. [QBR2] యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు. [QBR] కానీ తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు. [QBR]
24. యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి. [PE]