1. యెహోవా, నా పోరాటాలు పోరాడుము [QBR2] నా యుద్ధాలు పోరాడుము. [QBR]
2. యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, [QBR2] లేచి, నాకు సహాయం చేయుము. [QBR]
3. ఈటె, బరిసె తీసుకొని [QBR2] నన్ను తరుముతున్న వారతో పోరాడుము. [QBR] “నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4. కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు. [QBR2] ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము. [QBR2] వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము. [QBR] ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు. [QBR2] వారిని ఇబ్బంది పెట్టుము. [QBR]
5. ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము. [QBR2] యెహోవా దూత వారిని తరిమేలా చేయుము. [QBR]
6. యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టు చేయుము. [QBR2] యెహోవా దూత వారిని తరుమును గాక! [QBR]
7. నేనేమీ తప్పు చేయలేదు. కానీ ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు. [QBR2] నేను తప్పు ఏమీ చేయలేదు. కానీ వారు నన్ను పట్టు కోవాలని ప్రయత్నించారు. [QBR]
8. కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము. [QBR2] వారి సోంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము. [QBR2] తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము. [QBR]
9. అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను. [QBR2] ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను. [QBR]
10. “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు. [QBR2] యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు. [QBR] దోచుకొను వారి నుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు” [QBR2] అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబతాను. [QBR]
11. ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది. [QBR2] ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు. [QBR]
12. నేను మంచి పనులు మాత్రమే చేశాను. [QBR2] కానీ ఆ మనుష్యులు నాకు చెడ్డ వాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు. [QBR]
13. ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను. [QBR2] ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను. [QBR2] నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది. [QBR]
14. ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. [QBR2] ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను. [QBR]
15. అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు. [QBR2] ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. [QBR] వాళ్లు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను. [QBR]
16. వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. [QBR2] ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.
17. నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు? [QBR2] ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము. [QBR2] ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.
18. యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. [QBR2] నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను. [QBR]
19. అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు. [QBR2] నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు. [QBR]
20. నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు. [QBR2] ఈ దేశంలో శాంతియుతంగా ఉన్న ప్రజలే చె డు కార్యాలు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు. [QBR]
21. నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబతున్నారు. [QBR2] వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీ వేమీ చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.” [QBR]
22. యెహోవా జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు. [QBR2] కనుక మౌనంగా ఉండవద్దు. [QBR2] నన్ను విడిచి పెట్టవద్దు. [QBR]
23. యెహోవా మేలుకో! లెమ్ము! [QBR2] నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము. [QBR]
24. యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము. [QBR2] ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వ నీయవద్దు. [QBR]
25. “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము. [QBR2] “యెహోనా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము. [QBR]
26. నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము. [QBR2] నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు. [QBR] తాము నాకంటె మేలైనవారము అని వారు తలచారు. [QBR2] కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను సిగ్గుతోను నింపి వేయుము. [QBR]
27. నీతిని ప్రేమించే మనుష్యులారా [QBR2] మీరు సంతోషించండి. [QBR] ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”
28. యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబతాను. [QBR2] నేను ప్రతి దినము స్తుతిస్తాను. [PE]