పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
కీర్తనల గ్రంథము
1. యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము.
2. యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు సహాయం చేయుము.
3. ఈటె, బరిసె తీసుకొని నన్ను తరుముతున్న వారతో పోరాడుము. “నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4. కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము. వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టుము.
5. ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము. యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
6. యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టు చేయుము. యెహోవా దూత వారిని తరుమును గాక!
7. నేనేమీ తప్పు చేయలేదు. కానీ ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు. నేను తప్పు ఏమీ చేయలేదు. కానీ వారు నన్ను పట్టు కోవాలని ప్రయత్నించారు.
8. కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము. వారి సోంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము. తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
9. అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను. ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10. “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు. యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు. దోచుకొను వారి నుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు” అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబతాను.
11. ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది. ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12. నేను మంచి పనులు మాత్రమే చేశాను. కానీ ఆ మనుష్యులు నాకు చెడ్డ వాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13. ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను. ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను. నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14. ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15. అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు. ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. వాళ్లు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను.
16. వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.
17. నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు? ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము. ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.
18. యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19. అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు. నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20. నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు. ఈ దేశంలో శాంతియుతంగా ఉన్న ప్రజలే చె డు కార్యాలు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21. నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబతున్నారు. వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీ వేమీ చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22. యెహోవా జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు. కనుక మౌనంగా ఉండవద్దు. నన్ను విడిచి పెట్టవద్దు.
23. యెహోవా మేలుకో! లెమ్ము! నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24. యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము. ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వ నీయవద్దు.
25. “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము. “యెహోనా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26. నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము. నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు. తాము నాకంటె మేలైనవారము అని వారు తలచారు. కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను సిగ్గుతోను నింపి వేయుము.
27. నీతిని ప్రేమించే మనుష్యులారా మీరు సంతోషించండి. ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు. “
28. యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబతాను. నేను ప్రతి దినము స్తుతిస్తాను.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 35 of Total Chapters 150
కీర్తనల గ్రంథము 35:150
1. యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము.
2. యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు సహాయం చేయుము.
3. ఈటె, బరిసె తీసుకొని నన్ను తరుముతున్న వారతో పోరాడుము. “నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4. కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు. ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము. వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము. మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టుము.
5. మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము. యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
6. యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టు చేయుము. యెహోవా దూత వారిని తరుమును గాక!
7. నేనేమీ తప్పు చేయలేదు. కానీ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు. నేను తప్పు ఏమీ చేయలేదు. కానీ వారు నన్ను పట్టు కోవాలని ప్రయత్నించారు.
8. కనుక యెహోవా, మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము. వారి సోంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము. తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
9. అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను. ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10. “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు. యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు. దోచుకొను వారి నుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు” అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబతాను.
11. ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది. మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12. నేను మంచి పనులు మాత్రమే చేశాను. కానీ మనుష్యులు నాకు చెడ్డ వాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13. మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను. ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను. నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14. మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15. అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు మనుష్యులే నన్ను చూసి నవ్వారు. మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. వాళ్లు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను.
16. వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.
17. నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు? మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము. దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.
18. యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19. అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు. నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20. నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు. దేశంలో శాంతియుతంగా ఉన్న ప్రజలే చె డు కార్యాలు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21. నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబతున్నారు. వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీ వేమీ చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22. యెహోవా జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు. కనుక మౌనంగా ఉండవద్దు. నన్ను విడిచి పెట్టవద్దు.
23. యెహోవా మేలుకో! లెమ్ము! నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24. యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము. మనుష్యులను నన్ను చూచి నవ్వ నీయవద్దు.
25. “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము. “యెహోనా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26. నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము. నాకు కీడు జరిగినప్పుడు మనుష్యులు సంతోషించారు. తాము నాకంటె మేలైనవారము అని వారు తలచారు. కనుక మనుష్యుల్ని అవమానంతోను సిగ్గుతోను నింపి వేయుము.
27. నీతిని ప్రేమించే మనుష్యులారా మీరు సంతోషించండి. ఎల్లప్పుడూ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.
28. యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబతాను. నేను ప్రతి దినము స్తుతిస్తాను.
Total 150 Chapters, Current Chapter 35 of Total Chapters 150
×

Alert

×

telugu Letters Keypad References