1. యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు [QBR2] నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము. [QBR]
2. యెహోవా, నీవు నన్ను బాధించావు. [QBR2] నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి. [QBR]
3. నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. [QBR2] నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి. [QBR]
4. నేను చెడు కార్యాలు చేసిన దోషిని, [QBR2] ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. [QBR]
5. నేను తెలివి తక్కువగా ఉన్నాను. [QBR2] ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి. [QBR]
6. నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. [QBR2] రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను. [QBR]
7. నా నడుము వేడిగా కాలిపోతోంది. [QBR2] నా శరీరం అంతా బాధగా ఉంది. [QBR]
8. నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. [QBR2] నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను. [QBR]
9. ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. [QBR2] నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు. [QBR]
10. నా గుండె తడబడచున్నది. నా బలం పోయింది. [QBR2] నా చూపు దాదాపు పోయింది. [QBR]
11. నా రోగం మూలంగా నా స్నేహితులు, [QBR2] నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. [QBR2] నా కుటుంబం నా దగ్గరకు రాదు. [QBR]
12. నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. [QBR2] నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడు కొంటున్నారు. [QBR2] వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు. [QBR]
13. అయితే నేను వినబడని చెవిటి వానిలా ఉన్నాను. [QBR2] మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను. [QBR]
14. ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటి వానిలా నేను ఉన్నాను. [QBR2] నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను. [QBR]
15. కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. [QBR2] నా దేవా, నా ప్రభువా నా శత్రువులకు సత్యం చెప్పుము. [QBR]
16. నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. [QBR2] నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు. [QBR]
17. నేను పడిపోయేటట్టు ఉన్నాను. [QBR2] నేను నా బాధను మరచిపోలేను. [QBR]
18. యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను. [QBR2] నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను. [QBR]
19. నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, [QBR2] వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. [QBR]
20. నా శత్రువులు నాకు కీడు చేస్తారు, [QBR2] నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను. [QBR] మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. [QBR2] కానీ ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు. [QBR]
21. యెహోవా, నన్ను విడిచిపెట్టకు. [QBR2] నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు. [QBR]
22. త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. [QBR2] నా దేవా నన్ను రక్షించుము. [PE]