1. దేవాది దేవుడు యెహోవా మాట్లాడాడు. [QBR2] సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు. [QBR]
2. సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది. [QBR]
3. మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. [QBR2] ఆయన యెదుట అగ్ని మండుతుంది. [QBR2] ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది. [QBR]
4. తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని, [QBR2] కింద భూమిని ఆయన పిలుస్తున్నాడు. [QBR]
5. “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి. [QBR2] వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని చెప్పారు.
6. అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి. [QBR2] ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
7. దేవుడు చెబతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి. [QBR2] ఇశ్రాయేలు ప్రజలారా మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను. [QBR2] నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి. [QBR]
8. నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు. [QBR2] ఇశ్రాయేలు ప్రజలారా మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు. [QBR]
9. మీ ఇంటినుండి యెద్దులను తీసుకోను. [QBR2] మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు. [QBR]
10. ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. [QBR2] వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. [QBR]
11. కొండల్లో వుండే ప్రతి పక్షి నాకు తెలుసు. [QBR2] పొలాల్లో చలించే ప్రతీదీ నా సొంతం [QBR]
12. నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు [QBR2] ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం. [QBR]
13. నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను.”
14. దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి, [QBR2] దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి. [QBR]
15. “ఇశ్రాయేలు ప్రజలారా మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి! [QBR2] నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
16. దుర్మార్గులతో దేవుడు చెబతున్నాడు, [QBR2] “నా న్యాయ విధులను చదువుటకు [QBR2] నా ఒడంబడికకు బద్దులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది? [*నా … మీకేమి హక్కున్నది? ఇది బహుశ ఒక ఆచార వేడుకను సూచిస్తుండవచ్చును. అందులో దేవునితో ఒడంబడికకు ప్రజలు తమ సమర్పణను తిరిగి దృఢపరుస్తారు.] [QBR]
17. కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు. [QBR2] నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు. [QBR]
18. మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడుతారు. [QBR2] వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు. [QBR]
19. మీరు చెడు సంగతులు చెబతారు, అబద్ధాలు పలుకుతారు. [QBR]
20. మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబతారు. [QBR2] మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు. [QBR]
21. మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను [QBR2] నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు. [QBR] కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను. [QBR2] మరియు మీ ముఖంమీద నిందమోపుతాను. [QBR]
22. నేను మిమ్ములను చీల్చివేయకముందే, [QBR2] దేవుని మరచిన జనాంగమైన మీరు, [QBR] ఈ విషయంను గూర్చి ఆలోంచించాలి. [QBR2] అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు. [QBR]
23. ఒక వ్యక్తి కృతజ్ఞతా అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు. [QBR2] నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.” [PE]