1. దేవా నీ నమ్మకమైన ప్రేమ మూలంగా [QBR2] నా మీద దయ చూపించుము. [QBR] నీ మహా దయ మూలంగా [QBR2] నా పాపాలన్నీ తుడిచివేయుము. [QBR]
2. దేవా, నా దోషం అంతా తీసివేయుము. [QBR2] నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము. [QBR]
3. నేను పాపం చేశానని నాకు తెలుసు. [QBR2] నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను. [QBR]
4. తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. [QBR2] దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. [QBR] కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. [QBR2] నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే. [QBR]
5. నేను పాపంలో పుట్టాను. [QBR2] పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. [QBR]
6. దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు. [QBR2] అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము. [QBR]
7. హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము. [QBR2] నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము. [QBR]
8. నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము. [QBR2] నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము. [QBR]
9. నా పాపాలను చూడకుము! [QBR2] వాటన్నింటినీ తుడిచి వేయుము. [QBR]
10. దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము [QBR2] నా ఆత్మను నూతనపరచి బలపరచుము. [QBR]
11. నన్ను తోసివేయకుము! [QBR2] నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము. [QBR]
12. నీచేత రక్షించబడుట మూలంగా [QBR2] కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము! [QBR2] నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము. [QBR]
13. నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను. [QBR2] వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు. [QBR]
14. దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము. [QBR2] నా దేవా, నీవే నా రక్షకుడవు. [QBR] నీవు ఎంత మంచివాడవోనని నన్ను పాడనిమ్ము. [QBR2]
15. నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము. [QBR]
16. నీవు బలులు కోరటం లేదు. [QBR2] లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు. [QBR]
17. దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. [QBR2] దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
18. దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము. [QBR2] యెరూషలేము గోడలను కట్టుము. [QBR]
19. అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు. [QBR2] మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు. [PE]