1. దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్ములను ఉద్దరించుము.
|
5. నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు, నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.
|
6. దేవుడు తన ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు. “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను. షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
|
8. మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను. ఎదోము నా చెప్పులు మోసేబానిసగా ఉంటుంది. ఫిలిప్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”
|
9. బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు? ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
|
10. దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు. కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
|