పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవా, నా కష్టాలన్నిటి నుండీ నన్ను రక్షించుము. [QBR2] నా నోటి వరకు నీళ్లు లేచాయి. [QBR]
2. నిలబడి ఉండుటకు ఏదీ లేదు. [QBR2] నేను మునిగిపోతున్నాను. కింద బురదలోకి దిగజారిపోతున్నాను. [QBR] లోతైనజలాల్లో నేనున్నాను. [QBR2] అలలు నా చుట్టూకొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను. [QBR]
3. సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను. [QBR2] నా గొంతు నొప్పిగా ఉంది. [QBR] నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు [QBR2] నేను నీ సహాయం కోసం కని పెట్టి చూశాను. [QBR]
4. నా తలపైగల వెంట్రుకల కంటే ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు. [QBR2] ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు. [QBR2] వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. [QBR] నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. [QBR2] వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు. [QBR2] ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు. [QBR]
5. దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. [QBR2] నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు. [QBR]
6. నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము. [QBR2] ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము. [QBR]
7. నా ముఖం సిగ్గుతో నిండి ఉంది. [QBR2] నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను. [QBR]
8. నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు. [QBR2] నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు. [QBR]
9. నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది. [QBR2] నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను. [QBR]
10. నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను. [QBR2] అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. [QBR]
11. నా విచారాన్ని చూపించేందుకు నేను మోటుబట్టలు ధరిస్తున్నాను. [QBR2] ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు. [QBR]
12. బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు. [QBR2] తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు. [QBR]
13. నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన. [QBR2] నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. [QBR] దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. [QBR]
14. బురదలో నుండి నన్ను పైకిలాగుము. [QBR2] బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు. [QBR] నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. [QBR2] లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము. [QBR]
15. అలలు నన్ను ముంచివేయనీయకుము. [QBR2] లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము. [QBR2] సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము [QBR]
16. యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము. [QBR2] నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకోనుము. [QBR]
17. నీ సేవకునికి విముఖుడవు కావద్దు. [QBR2] నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము. [QBR]
18. వచ్చి నా ఆత్మను రక్షించుము. [QBR2] నా శత్రువులనుండి నన్ను తప్పించుము. [QBR]
19. నా అవమానం నీకు తెలుసు. [QBR2] నా శత్రువులు నన్ను అవమాన పరిచారని నీకు తెలుసు. [QBR2] వారు నన్ను కించపరచటం నీవు చూసావు. [QBR]
20. సిగ్గు నన్ను కృంగదీసింది. [QBR2] అవమానం చేత నేను చావబోతున్నాను. [QBR] సానుభూతి కోసం నేను ఎదురు చూశాను. [QBR2] కాని ఏమీ దొరకలేదు. [QBR] ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను. [QBR2] కాని ఎవరూ రాలేదు. [QBR]
21. వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు. [QBR2] ద్రాక్షా రసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు. [QBR]
22. వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి. [QBR2] విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక. [QBR]
23. వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము. [QBR]
24. నీ కోపమును వారిపై కుమ్మరించుము. [QBR2] నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము. [QBR]
25. వారి కుటుంబాలు, ఇండ్లు [QBR2] పూర్తిగా నాశనం చేయబడునుగాక. [QBR]
26. నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు. [QBR2] అప్పుడుబాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు. [QBR]
27. వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము. [QBR2] నీవు ఎంత మంచి వాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు. [QBR]
28. జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము. [QBR2] మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు. [QBR]
29. నేను విచారంగాను, బాధతోను ఉన్నాను. [QBR2] దేవా నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము. [QBR]
30. దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను. [QBR2] కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను. [QBR]
31. ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము. [QBR2] ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది. [QBR]
32. పేద ప్రజలారా మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు. [QBR2] పేద ప్రజలారా ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు. [QBR]
33. నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. [QBR2] యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు. [QBR]
34. ఆకాశమా, భూమీ, సముద్రమా, [QBR2] దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి. [QBR]
35. యెహోవా సీయోనును రక్షిస్తాడు. [QBR2] యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు. [QBR] ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు. [QBR2]
36. ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు. [QBR2] ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 69 / 150
కీర్తనల గ్రంథము 69:146
1 దేవా, నా కష్టాలన్నిటి నుండీ నన్ను రక్షించుము. నా నోటి వరకు నీళ్లు లేచాయి. 2 నిలబడి ఉండుటకు ఏదీ లేదు. నేను మునిగిపోతున్నాను. కింద బురదలోకి దిగజారిపోతున్నాను. లోతైనజలాల్లో నేనున్నాను. అలలు నా చుట్టూకొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను. 3 సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను. నా గొంతు నొప్పిగా ఉంది. నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు నేను నీ సహాయం కోసం కని పెట్టి చూశాను. 4 నా తలపైగల వెంట్రుకల కంటే ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు. ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు. వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు. ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు. 5 దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు. 6 నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము. ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము. 7 నా ముఖం సిగ్గుతో నిండి ఉంది. నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను. 8 నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు. నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు. 9 నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది. నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను. 10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను. అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. 11 నా విచారాన్ని చూపించేందుకు నేను మోటుబట్టలు ధరిస్తున్నాను. ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు. 12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు. 13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన. నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. 14 బురదలో నుండి నన్ను పైకిలాగుము. బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు. నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము. 15 అలలు నన్ను ముంచివేయనీయకుము. లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము. సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము 16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము. నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకోనుము. 17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు. నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము. 18 వచ్చి నా ఆత్మను రక్షించుము. నా శత్రువులనుండి నన్ను తప్పించుము. 19 నా అవమానం నీకు తెలుసు. నా శత్రువులు నన్ను అవమాన పరిచారని నీకు తెలుసు. వారు నన్ను కించపరచటం నీవు చూసావు. 20 సిగ్గు నన్ను కృంగదీసింది. అవమానం చేత నేను చావబోతున్నాను. సానుభూతి కోసం నేను ఎదురు చూశాను. కాని ఏమీ దొరకలేదు. ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను. కాని ఎవరూ రాలేదు. 21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు. ద్రాక్షా రసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు. 22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి. విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక. 23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము. 24 నీ కోపమును వారిపై కుమ్మరించుము. నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము. 25 వారి కుటుంబాలు, ఇండ్లు పూర్తిగా నాశనం చేయబడునుగాక. 26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు. అప్పుడుబాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు. 27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము. నీవు ఎంత మంచి వాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు. 28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము. మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు. 29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను. దేవా నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము. 30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను. కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను. 31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము. ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది. 32 పేద ప్రజలారా మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు. పేద ప్రజలారా ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు. 33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు. 34 ఆకాశమా, భూమీ, సముద్రమా, దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి. 35 యెహోవా సీయోనును రక్షిస్తాడు. యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు. ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు. 36 ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 69 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References