1. యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. [QBR2] కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందును. [QBR]
2. నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు. [QBR2] నా మాట వినుము. నన్ను రక్షించుము. [QBR]
3. భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము. [QBR2] నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము. [QBR] నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు. [QBR]
4. నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. [QBR2] కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. [QBR]
5. నా ప్రభువా, నీవే నా నిరీక్షణ. [QBR2] నేను నా యౌవ్వనకాలంనండి నిన్ను నమ్ముకొన్నాను. [QBR]
6. నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను. [QBR2] నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు. [QBR2] నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను. [QBR]
7. ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను. [QBR2] ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం. [QBR]
8. నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను. [QBR]
9. కనుక నేను ముసలివాడినని నన్ను తోసివేయకుము. [QBR2] నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము. [QBR]
10. నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు. [QBR2] ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు. [QBR]
11. “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి. [QBR2] అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు. [QBR]
12. దేవా, నన్ను విడిచిపెట్టకుము. [QBR2] దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము. [QBR]
13. నా శత్రువులను ఓడించుము. [QBR2] వారిని పూర్తిగా నాశనం చేయుము. [QBR] వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు. [QBR2] వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ. [QBR]
14. అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను. [QBR2] నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను. [QBR]
15. నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబతాను. [QBR2] నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబతాను. [QBR2] లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు. [QBR]
16. యేహోవా, నా ప్రభూ, ని గోప్పతనాన్ని గూర్చి నేను చెబతాను. [QBR2] నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను. [QBR]
17. దేవా, నేను చిన్న వానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు. [QBR2] నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబతూనే ఉన్నాను. [QBR]
18. దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. [QBR2] నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి కొత్త తరానికీ నేను చెబతాను. [QBR]
19. దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది. [QBR2] దేవా, నీ వంటి దేవుడు మరొకడు లేడు. [QBR2] నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు. [QBR]
20. నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు. [QBR2] కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు. [QBR2] భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు. [QBR]
21. ఇదివరకటి కంటే గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము. [QBR2] నన్ను ఆదరిస్తూనే ఉండుము. [QBR2]
22. స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను. [QBR2] నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను. [QBR2] ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను. [QBR]
23. నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. [QBR2] నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను. [QBR]
24. అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది. [QBR2] నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు. [PE]