1. దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు. [QBR2] పవిత్ర హృదయాలు కల ప్రజలకు దేవుడు మంచివాడు. [QBR]
2. నేను దాదాపుగా జారిపోయి, [QBR2] పాపం చేయటం మొదలు పెట్టాను. [QBR]
3. దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను. [QBR2] ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను. [QBR]
4. ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు. [QBR2] వారు జీవించుటకు శ్రమపడరు. [*వారు … శ్రమపడరు అక్షరార్థముగా వారి మరణానికి బంధాలు లేవు.] [QBR]
5. మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు. [QBR2] ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు. [QBR]
6. కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు. [QBR2] వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంతతేటగా ఉన్నాయో ఈ విషయం అంత తేట తెల్లం. [QBR]
7. ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు. [QBR2] వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు. [QBR]
8. ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు. [QBR2] వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు. [QBR]
9. ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు. [QBR2] వారు భూమిని పాలించేవారని తలుస్తారు. [QBR]
10. కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి [QBR2] వారు చెప్పే సంగతులు నమ్ముతారు. [QBR]
11. “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు. [QBR2] సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబతారు.”
12. ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు. [QBR2] మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు. [QBR]
13. కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి? [QBR2] నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి? [QBR]
14. దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను. [QBR2] నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు. [QBR]
15. ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను. [QBR2] కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది. [QBR]
16. ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను. [QBR2] కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది. [QBR]
17. నేను దేవుని ఆలయానికి వెళ్లాను, [QBR2] వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను. [QBR]
18. దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు. [QBR2] వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం. [QBR]
19. కష్టం అకస్మాత్తుగా రావచ్చును. [QBR2] అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు. [QBR] భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు. [QBR2] అప్పుడు వారు అంతమై పోతారు. [QBR]
20. యెహోవా, మేము మేల్కొన్నప్పుడు [QBR2] మరచి పోయే కలవంటి వారు ఆ మనుష్యులు. [QBR] మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను [QBR2] నీవు కనబడకుండా చేస్తావు.
21. (21-22) నేను చాలా తెలివి తక్కువ వాడను. [QBR2] ధనికులను దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను. [QBR] దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను. [QBR2] తెలివి తక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను. [QBR]
22.
23. నాకు కావలసిందంతా నాకు ఉంది నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. [QBR2] దేవా, నీవు నా చేయిపట్టు కొనుము. [QBR]
24. దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము. [QBR2] ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు. [QBR]
25. దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు. [QBR2] మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి? [QBR]
26. ఒకవేళ నా మనస్సు, [†మనస్సు అక్షరార్థముగా “హృదయుము.”] నా శరీరం నాశనం చేయబడుతాయేమో. [QBR2] కాని నేను ప్రేమించే బండ [‡బండ దేవుని సహాయం.] నాకు ఉంది. [QBR2] నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు. [QBR]
27. దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు. [QBR2] నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు. [QBR]
28. కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను. [QBR2] దేవుడు నా యెడల దయ చూపించాడు. [QBR2] నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం. [QBR2] దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబతాను. [PE]