1. నా ప్రజలారా నా ఉపదేశాలను వినండి. [QBR2] నేను చెప్పే విషయాలు వినండి. [QBR]
2. ఈ కథ మీతో చెబతాను. [QBR2] ఈ పురాతన కథ నేను మీతో చెబతాను. [QBR]
3. ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు. [QBR2] మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు. [QBR]
4. ఈ కథను మనము మరచిపోము. [QBR2] మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబతారు. [QBR] మనమంతా యెహోవాను స్తుతిద్దాము. [QBR2] ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబదాము. [QBR]
5. యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు. [QBR2] దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మ శాస్త్రాన్ని ఇచ్చాడు. [QBR2] మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు. [QBR2] మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు. [QBR]
6. ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మ శాస్త్రాన్ని తెలుసుకొంటారు. [QBR2] కొత్త తరాలు పుడుతాయి వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబతారు. [QBR]
7. కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు. [QBR2] దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు. [QBR2] వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు. [QBR]
8. ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే, [QBR2] అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు. [QBR] వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు. [QBR2] ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.
9. ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు [*విసురు కర్రలు ఇది ఒక వంకర కర్ర, పక్షులను చంపడానికి ఉపయోగిస్తారు. దీన్ని సరిగ్గా ప్రయోగిస్తే నేరుగా ఎగిరి, భూమికి వంగి, మరల గాలిలోకి ఒక్కసారిగా ఎగురగలరు. ఒక్కొక్కసారి ఇది మళ్లీ ప్రయోగించిన వానివద్దకే రాగలదు. అక్షరాలా విసురుడు బాణం.] కలిగి ఉన్నారు. [QBR2] కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు. [QBR]
10. వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపు కోలేదు. [QBR2] దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు. [QBR]
11. ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు. [QBR2] ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు. [QBR]
12. ఈజిప్టులోను, సోయను వద్దను [QBR2] దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు. [QBR]
13. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు. [QBR2] వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి. [QBR]
14. ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. [QBR2] ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు. [QBR]
15. అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు. [QBR2] భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు. [QBR]
16. బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు. [QBR2] అది ఒక నదిలా ఉంది. [QBR]
17. కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు. [QBR2] అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు. [QBR]
18. అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు. [QBR2] కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు. [QBR]
19. వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. [QBR2] “ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా? [QBR]
20. దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది. [QBR2] తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు. [QBR]
21. ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు. [QBR2] యాకోబు [†యాకోబు ఇశ్రాయేలుకు మరో పేరు.] మీద దేవునికి చాలా కోపం వచ్చింది. [QBR] ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది. [QBR2]
22. ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు. [QBR] దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు. [QBR]
23. (23-24) కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు. [QBR2] వారికి ఆహారంగా ఆయన మన్నా కురిపించాడు. [QBR] అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు [QBR2] ఆకాశంలోని ధాన్యా గారం నుండి ధాన్యం పోసినట్టు ఉంది. [QBR]
24.
25. ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు. [QBR2] ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు. [QBR]
26. (26-27) అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు. [QBR] వర్షం కురిసినట్లుగా పూరేళ్లు [‡పూరేళ్లు ఒక విధమైన పక్షి.] వారిమీద వచ్చి పడ్డాయి. [QBR2] దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది. [QBR2] ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది. [QBR]
27.
28. ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో [QBR2] ఆ పక్షులు వచ్చి పడ్డాయి. [QBR]
29. తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది. [QBR2] కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు. [QBR]
30. వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు. [QBR2] అందు చేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు ఆ పూరేళ్లను తినివేసారు. [QBR]
31. ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు. [QBR2] ఆరోగ్యవంతులైన అనేకమంది పడుచువాళ్లు చచ్చేటట్టుగా దేవుడు చేశాడు. [QBR]
32. కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు. [QBR2] దేవుడు చేయగల ఆశ్చర్యకరమైన విషయాల మీద వారు ఆధారపడలేదు. [QBR]
33. కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను [QBR2] ఏదో విపత్తుతో అంతం చేశాడు. [QBR]
34. దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలిన వారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు. [QBR2] వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు. [QBR]
35. దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. [QBR2] సర్వోన్నతుడైన దేవుడే తమని రక్షించాడని వారు జ్ఞాపకం చేసుకొంటారు. [QBR]
36. వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు, [QBR2] కాని వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చేప్పారు. [QBR]
37. వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు. [QBR2] వారు ఒడంబడికకు నమ్మకంగా లేరు. [QBR]
38. కాని దేవుడు దయకలిగినవాడు. [QBR2] వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు. [QBR] అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు. [QBR2] దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు. [QBR]
39. వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. [QBR2] మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు. [QBR]
40. అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు. [QBR2] ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు. [QBR]
41. ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు. [QBR2] ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు. [QBR]
42. ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు. [QBR2] శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు. [QBR]
43. ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు. [QBR2] సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు. [QBR]
44. నదులను దేవుడు రక్తంగా మార్చాడు! [QBR2] ఈజిప్టు వారు నీళ్లు తాగలేకపోయారు. [QBR]
45. ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు. [QBR2] ఈజిప్టు వారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు. [QBR]
46. దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు. [QBR2] వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు. [QBR]
47. ఈజిప్టు వారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు. [QBR2] వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడు కొన్నాడు. [QBR]
48. దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను [QBR2] వారి పశుపులను పిడుగుల చేతను చంపేశాడు. [QBR]
49. దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు. [QBR2] నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు. [QBR]
50. దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు. [QBR2] ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు. [QBR2] వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు. [QBR]
51. ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు. [QBR2] హాము [§హాము ఈజిప్టువాళ్లు హాము సంతానం.] సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు. [QBR]
52. తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు. [QBR2] ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు. [QBR]
53. ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు. [QBR2] దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు. [QBR2] వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు. [QBR]
54. దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు. [QBR2] తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు. [QBR]
55. ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు. [QBR2] దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు. [QBR2] అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు. [QBR]
56. కానీ ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు. [QBR2] ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు. [QBR]
57. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లు కొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మ కస్తులుగాను ఉన్నారు. [QBR2] వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు. [QBR]
58. ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు. [QBR2] దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు. [QBR]
59. దేవుడు ఇది విని చాలా కోపగించాడు. [QBR2] మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు. [QBR]
60. షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. [QBR2] ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం. [QBR]
61. అప్పుడు దేవుడు ఇతర రాజ్యాల ద్వారా తన ప్రజలను బందీలుగా చేయనిచ్చాడు. [QBR2] దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు. [QBR]
62. తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు. [QBR2] ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు. [QBR]
63. యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు. [QBR2] పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు. [QBR]
64. యాజకులు చంపివేయబడ్డారు. [QBR2] కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు. [QBR]
65. తాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె, [QBR2] నిద్రనుండి మేల్కోన్న మనిషివలె ప్రభువు లేచాడు. [QBR]
66. దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు. [QBR2] దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు. [QBR]
67. కానీ యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు. [QBR2] ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు. [QBR]
68. దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు. [QBR2] మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు. [QBR]
69. ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు. [QBR2] భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు. [QBR]
70. తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు. [QBR2] దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు. [QBR]
71. గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి, [QBR2] తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు. [QBR]
72. మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. [QBR2] అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు. [PE]