2. యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు. నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు. నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
|
5. ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
|
9. ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు. వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
|
11. యెహోవా నీ మార్గాలు నాకు నేర్పించు నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను. నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా అతి ముఖ్యాంశంగా చేయుము.
|
12. దేవా, నా ప్రభువా నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
|
14. దేవా, గర్విష్టులు నాపై పడుతున్నారు. కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
|
16. దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము. నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను. నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
|
17. దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము. అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు. ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.
|