1. యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు. [QBR2] రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. [QBR]
2. దయచేసి నా ప్రార్థనలను గమనించుము. [QBR2] కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము. [QBR]
3. నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను. [QBR2] మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. [QBR]
4. జీవించుటకు బహు బలహీనుడివలె చనిపోయిన మనిషివలె [QBR2] ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు. [QBR]
5. మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను. [QBR2] నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను. [QBR] నీనుండీ నీ జాగ్రత్తనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను. [QBR2] మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు. [QBR]
6. యెహోవా, నీవు నన్ను భూమి కింద సమాధిలో ఉంచావు. [QBR2] నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు. [QBR]
7. నీవు నా మీద కోపగించావు. [QBR2] నీవు నన్ను శిక్షించావు.
8. నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. [QBR2] అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు. [QBR] నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను. [QBR2]
9. నా బాధ అంతటినీ గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి. [QBR] యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను. [QBR2] ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను. [QBR]
10. యెహోవా, చనిపోయిన వారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు! [QBR2] దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!
11. చనిపోయిన వాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు. [QBR2] చనిపోయిన వారు మృతులలోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు. [QBR]
12. చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు. [QBR2] మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు. [QBR]
13. యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. [QBR2] ప్రతి వేకువ ఝామునా నేను నిన్ను ప్రార్థిస్తాను. [QBR]
14. యోహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు? [QBR2] నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు? [QBR]
15. నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని. [QBR2] నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను. [QBR]
16. యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు. [QBR2] శిక్ష నన్ను చంపేస్తుంది. [QBR]
17. నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. [QBR2] నా నొప్పులు, బాధల్లో నేను మునిగి పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. [QBR]
18. మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచి పెట్టివేసేటట్టుగా నీవు చేశావు. [QBR2] చీకటి మాత్రమే నాకు మిగిలింది. [PE]