పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు [QBR2] సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు. [QBR]
2. “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.” [QBR2] అని నేను యెహోవాకు చెబతాను. [QBR]
3. దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. [QBR2] ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. [QBR]
4. కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. [QBR2] పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. [QBR2] దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు. [QBR]
5. రాత్రివేళ నీవు దేనికి భయపడవు. [QBR2] పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు. [QBR]
6. చీకటిలో దాపురించే రోగాలకు గాని [QBR2] మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు. [QBR]
7. నీ పక్కన వేయిమంది, [QBR2] నీ కుడిచేతి పక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు. [QBR2] నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు. [QBR]
8. ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా [QBR2] నీకు కనబడుతుంది. [QBR]
9. ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక. [QBR2] సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక. [QBR]
10. కీడు ఏమీ నీకు జరగదు. [QBR2] నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు. [QBR]
11. ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు. [QBR]
12. నీ పాదం రాయికి తగులకుండా [QBR2] దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు. [QBR]
13. సింహాల మీద, విషసర్పాల మీద [QBR2] నడిచే శక్తి నీకు ఉంటుంది. [QBR]
14. యెహోవా చెబతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను. [QBR2] నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను. [QBR]
15. నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు. [QBR2] నేను వారికి జవాబు ఇస్తాను. [QBR2] వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను. [QBR]
16. నా అనుచరులకు నేను దీర్గాయుష్షు యిస్తాను. [QBR2] నేను వాళ్లను రక్షిస్తాను.” [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 91 / 150
కీర్తనల గ్రంథము 91:10
1 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు. 2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.” అని నేను యెహోవాకు చెబతాను. 3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. 4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు. 5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు. పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు. 6 చీకటిలో దాపురించే రోగాలకు గాని మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు. 7 నీ పక్కన వేయిమంది, నీ కుడిచేతి పక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు. నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు. 8 ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా నీకు కనబడుతుంది. 9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక. సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక. 10 కీడు ఏమీ నీకు జరగదు. నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు. 11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు. 12 నీ పాదం రాయికి తగులకుండా దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు. 13 సింహాల మీద, విషసర్పాల మీద నడిచే శక్తి నీకు ఉంటుంది. 14 యెహోవా చెబతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను. 15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు. నేను వారికి జవాబు ఇస్తాను. వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను. 16 నా అనుచరులకు నేను దీర్గాయుష్షు యిస్తాను. నేను వాళ్లను రక్షిస్తాను.”
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 91 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References