1. {ఆమె అంటుంది} [PS] రాత్రి నా పక్క మీద, [QBR2] నేను ప్రే మించిన వానికోసం చూస్తాను. [QBR] అతని కోసం చూశాను, [QBR2] కాని అతణ్ణి కనుగొనలేకపోయాను! [QBR]
2. ఇప్పుడు మేల్కొంటాను! [QBR2] నగరమంతా తిరుగుతాను. [QBR] వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ [QBR2] నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. అతని కోసం చూశాను, [QBR2] కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను! [QBR]
3. నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు. [QBR2] వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?”
4. కావలివాళ్లను దాటిన వెంటనే [QBR2] నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను! [QBR] అతణ్ణి పట్టుకున్నాను. [QBR2] అతణ్ణి పోనివ్వలేదు, [QBR2] నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని పోయేవరకూ [QBR2] నన్ను కన్న తల్లి గదికి తీసుకొని పోయేవరకూ.
5. {ఆమె స్త్రీలతో అంటుంది} [PS] యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్లమీదా ఒట్టు పెట్టి, నేను సిద్ధపడేవరకూ. [QBR2] ప్రేమను లేపవద్దు, [QBR2] ప్రేమను పురికొల్పవద్దు.
6. {అతను} [PS] పెద్ద జనం గుంపుతో [QBR2] ఎడారినుండి వస్తున్న [*ఎడారినుండి వస్తున్న చూడండి 8:5.] ఈ స్త్రీ ఎవరు? [QBR] కాలుతున్న గోపరసం, సాంబ్రాణి [†గోపరసం, సాంబ్రాణి కాల్చినప్పుడు తియ్యగా గుబాళించే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు.] ఇతర సుగంధ ద్రవ్యాల [‡సుగంధ ద్రవ్యాలు శబ్ధార్థ ప్రకారం, “వర్తకుడి చూర్ణాలు” “విదేశాలనుండి దిగుమతి చేసుకోవసిన సుగంధ ద్రవ్యాలు, ధూపాలు.”] నుండి [QBR2] పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.
7. చూడు, సొలొమోను ప్రయాణపు కుర్చీ! [§ప్రయాణపు కుర్చీ ధనికులు కూర్చుని ప్రయాణం చేసే ఒకరకమైన కుర్చీ. ఈ కుర్చీలు పైన కప్పబడి వుంటాయి. వీటికి పొడుగాటి కర్ర లు దూర్చి, వాటిని బానిసలు మోస్తూ ఉంటారు.] [QBR2] అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు. [QBR2] బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు! [QBR]
8. వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు, [QBR2] వారి పక్కనున్న కత్తులు, [QBR2] ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం! [QBR]
9. రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు కుర్చీ చేయించాడు, [QBR2] దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది. [QBR]
10. దాని కాళ్లు వెండితో చేయబడ్డాయి, [QBR2] ఆధారాలు బంగారంతో చేయబడ్డాయి, [QBR] కూర్చొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది. [QBR2] యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
11. సీయోను స్త్రీలారా, బయటకు రండి [QBR2] రాజు సొలొమోనును చూడండి [QBR] అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున [QBR2] అతని తల్లి పెట్టిన కిరీటాన్ని [*కిరీట ము ఇది బహుశః అతని పెండ్లి సమయంలో తల మీద ధరించిన పూలదండ కావచ్చును.] చూడండి! [PE]