1. ఎదోమను ఏశావు వంశావళి ఇదే,
2. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,
3. ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లియాడెను.
4. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.
5. అహోలీబామా యూషును యాలామును కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే.
6. ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తె లను తన యింటివారినందరిని తన మంద లను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;
7. వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.
8. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.
9. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,
10. ఏశావు కుమా రుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును.
11. ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.
12. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.
13. రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
14. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహొలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు.
15. ఏశావు కుమారులలో వీరు నాయకులు; ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు, తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు,
16. కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.
17. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
18. వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీ బామా పుత్రసంతానపు నాయకులు.
19. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు.
20. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమా రులు, లోతాను శోబాలు సిబ్యోను అనా
21. దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.
22. లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
23. శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
24. సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్య ములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.
25. అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
26. దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను
27. ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
28. దీషాను కుమారులు ఊజు అరాను.
29. హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు
30. దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.
31. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు, ఎదోము దేశములో రాజ్యపరి పాలన చేసినరాజు లెవరనగా
32. బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా
33. బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అత నికి ప్రతిగా రాజాయెను.
34. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.
35. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు.
36. హదదు చనిపోయిన తరువాత మశ్రేకావాడైన శవ్లూ అతనికి ప్రతిగా రాజాయెను.
37. శవ్లూ చనిపోయిన తరువాత నదీతీర మందలి రహెబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను.
38. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను.
39. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయినతరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు క
40. మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు
41. అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు
42. కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
43. మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.