పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
న్యాయాధిపతులు
1. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.
2. అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.
3. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.
4. గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.
5. అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా
6. సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలె నని యడిగిరి.
7. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహము లను నూర్చి వేయుదునని చెప్పెను.
8. అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు
9. నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలు వారితో చెప్పెను.
10. అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.
11. అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.
12. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.
13. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను
14. హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక ¸°వనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.
15. అప్పుడతడు సుక్కో తువారి యొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహా రము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి
16. ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.
17. మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను.
18. అతడుమీరు తాబోరులో చంపిన మను ష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారు లను పోలియుండిరనగా
19. అతడువారు నా తల్లి కుమా రులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చిన యెడల
20. యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందు నని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచినీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
21. అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.
22. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతోనీవు మిద్యా నీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.
23. అందుకు గిద్యోనునేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.
24. మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.
25. అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.
26. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.
27. కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.
28. మిద్యానీ యులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరు వాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినము లలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.
29. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.
30. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.
31. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.
32. యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.
33. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక
34. మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.
35. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయుమరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.

గమనికలు

No Verse Added

మొత్తం 21 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 8 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
న్యాయాధిపతులు 8
1 అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. 2 అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను. 3 అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. 4 గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి. 5 అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా 6 సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలె నని యడిగిరి. 7 అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహము లను నూర్చి వేయుదునని చెప్పెను. 8 అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు 9 నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలు వారితో చెప్పెను. 10 అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి. 11 అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను. 12 జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను. 13 యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను 14 హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక ¸°వనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను. 15 అప్పుడతడు సుక్కో తువారి యొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహా రము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి 16 ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను. 17 మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను. 18 అతడుమీరు తాబోరులో చంపిన మను ష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారు లను పోలియుండిరనగా 19 అతడువారు నా తల్లి కుమా రులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చిన యెడల 20 యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందు నని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచినీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. 21 అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను. 22 అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతోనీవు మిద్యా నీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి. 23 అందుకు గిద్యోనునేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. 24 మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. 25 అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను. 26 మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను. 27 కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను. 28 మిద్యానీ యులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరు వాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినము లలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను. 29 తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను. 30 గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి. 31 షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను. 32 యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. 33 గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక 34 మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి. 35 మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయుమరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.
మొత్తం 21 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 8 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References