పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
సంఖ్యాకాండము
1. అప్పుడు బిలాముఇక్కడ నేను బలి అర్పించు టకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.
2. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలా మును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.
3. మరియు బిలాము బాలాకుతోబలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.
4. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడునేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా,
5. యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.
6. అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను.
7. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
8. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
9. మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు.
10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.
11. అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను.
12. అందు కతడుయెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రధ్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను.
13. అప్పుడు బాలాకుదయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడును గాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి
14. పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
15. అతడునీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా,
16. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.
17. అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు యెహోవా యేమి చెప్పెనని అడుగగా
18. బిలాము ఉపమానరీతిగా నిట్లనెను బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము.
19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
20. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.
21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.
22. రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.
23. నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును.
24. ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు.
25. అంతట బాలాకునీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా
26. బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా
27. బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొకచోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను.
28. బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత
29. బిలాముఇక్కడ నాకు ఏడు బలి పీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.
30. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
మొత్తం 36 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 23 / 36
1 అప్పుడు బిలాముఇక్కడ నేను బలి అర్పించు టకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. 2 బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలా మును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి. 3 మరియు బిలాము బాలాకుతోబలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను. 4 దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడునేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా, 5 యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను. 6 అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను. 7 అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. 8 ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. 9 మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు. 10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను. 11 అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. 12 అందు కతడుయెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రధ్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను. 13 అప్పుడు బాలాకుదయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడును గాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి 14 పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. 15 అతడునీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, 16 యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను. 17 అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు యెహోవా యేమి చెప్పెనని అడుగగా 18 బిలాము ఉపమానరీతిగా నిట్లనెను బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము. 19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? 20 ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను. 21 ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు. 22 రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు. 23 నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. 24 ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. 25 అంతట బాలాకునీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా 26 బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా 27 బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొకచోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. 28 బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత 29 బిలాముఇక్కడ నాకు ఏడు బలి పీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. 30 బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.
మొత్తం 36 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 23 / 36
×

Alert

×

Telugu Letters Keypad References