పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
లేవీయకాండము
1. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
2. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును.
3. వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము;
4. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము.
5. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
6. అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
7. స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
8. స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమి్మవేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
9. స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.
10. వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
11. స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
12. స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడు గవలెను.
13. స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రు డగును.
14. ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.
15. యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
16. ఒకనికి వీర్యస్ఖలనమైనయెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
17. ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును.
18. వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.
19. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.
20. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.
21. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
22. ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
23. అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
24. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రు డగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.
25. ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు.
26. ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండ వలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును.
27. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
28. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించు కొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును.
29. ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను.
30. యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
31. ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.
32. స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు,
33. స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.

గమనికలు

No Verse Added

మొత్తం 27 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 15 / 27
లేవీయకాండము 15:25
1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను 2 మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును. 3 వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము; 4 వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. 5 వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. 6 అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. 7 స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. 8 స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమి్మవేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. 9 స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. 10 వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. 11 స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. 12 స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడు గవలెను. 13 స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రు డగును. 14 ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను. 15 యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. 16 ఒకనికి వీర్యస్ఖలనమైనయెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. 17 ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును. 18 వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు. 19 స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు. 20 ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. 21 ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. 22 ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. 23 అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. 24 ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రు డగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. 25 ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు. 26 ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండ వలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును. 27 వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. 28 ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించు కొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. 29 ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను. 30 యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. 31 ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను. 32 స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, 33 స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.
మొత్తం 27 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 15 / 27
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References