1. {ఇశ్రాయేలు} (2:1-2; ఆది 35:23-26) PS ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
|
3. {యూదా} (2:5-15; రూతు 4:18-22; మత్తయి 1:3-6) PS యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు.
|
4. తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు. PEPS
|
7. కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు.
|
16. వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
|
18. హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు * యెరీయోతు అజూబా భార్య అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను.
|
19. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు.
|
21. తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు.
|
23. వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం.
|
24. హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు-ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి. PEPS
|
25. హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు.
|
29. అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు.
|
31. అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు.
|
32. షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు.
|
34. షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు
|
42. యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను.
|
46. కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు.
|
49. ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా. PEPS
|
50. ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు.
|
53. కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు. PEPS
|
54. శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ.
|
55. యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు. PE
|