పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
సమూయేలు మొదటి గ్రంథము
1. దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.
2. ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు. [PE][PS]
3. యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.
4. యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు. [PE][PS]
5. దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు. [PE][PS]
6. వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.
7. ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: [QBR] “సౌలు వెయ్యిమందిని, [QBR] దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు. [PE][PS]
8. ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు.
9. అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు. [PE][PS]
10. తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.
11. ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
12. యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు. [PE][PS]
13. అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు.
14. దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు. [PE][PS]
15. దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు.
16. దావీదు ఇశ్రాయేలువారితో, యూదావారితో కలిసిమెలిసి ఉండడంవల్ల వారు అతణ్ణి ప్రేమించారు. [PE][PS]
17. సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు.
18. దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు. [PE][PS]
19. అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు. [PE][PS]
20. అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు.
21. “ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు. [PE][PS]
22. సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.” [PE][PS]
23. సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.
24. సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు. [PE][PS]
25. ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.
26. సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో
27. గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు. [PE][PS]
28. యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతణ్ణి ప్రేమించడం చూసి,
29. సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు. [PE][PS]
30. ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 31 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 18 / 31
సమూయేలు మొదటి గ్రంథము 18:16
1 దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు. 2 ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు. 3 యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. 4 యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు. 5 దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు. 6 వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు. 7 ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు. 8 ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు. 9 అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు. 10 తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు. 11 ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు. 12 యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు. 13 అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు. 14 దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు. 15 దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు. 16 దావీదు ఇశ్రాయేలువారితో, యూదావారితో కలిసిమెలిసి ఉండడంవల్ల వారు అతణ్ణి ప్రేమించారు. 17 సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు. 18 దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు. 19 అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు. 20 అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు. 21 “ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు. 22 సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.” 23 సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు. 24 సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు. 25 ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు. 26 సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో 27 గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు. 28 యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతణ్ణి ప్రేమించడం చూసి, 29 సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు. 30 ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.
మొత్తం 31 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 18 / 31
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References