పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
రాజులు రెండవ గ్రంథము
1. {హిజ్కియా రోగం} (20:1-11; 2దిన 32:24-26; యెష 38:1-8) [PS] ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి “నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు” అని చెప్పాడు.
2. హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని,
3. “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు. [PE][PS]
4. యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,
5. “నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు. [PE][PS]
6. ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు.
7. తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు. [PE][PS]
8. “యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా
9. “తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు. [PE][PS]
10. అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు.
11. ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు. [PS]
12. {హిజ్కియా దగ్గరకు బబులోను రాయబారులు} (20:12-19; యెష 39:1-8) (20:20-21; 2దిన 32:32-33) [PS] ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.
13. వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు. [PE][PS]
14. తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు.
15. “నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు. [PE][PS]
16. అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను.
17. రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.
18. ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు. [PE][PS]
19. అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు.
20. హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
21. హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 25 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 20 / 25
రాజులు రెండవ గ్రంథము 20:19
1 హిజ్కియా రోగం (20:1-11; 2దిన 32:24-26; యెష 38:1-8) ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి “నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు” అని చెప్పాడు. 2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని, 3 “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు. 4 యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, 5 “నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు. 6 ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు. 7 తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు. 8 “యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా 9 “తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు. 10 అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు. 11 ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు. 12 హిజ్కియా దగ్గరకు బబులోను రాయబారులు (20:12-19; యెష 39:1-8) (20:20-21; 2దిన 32:32-33) ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు. 13 వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు. 14 తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు. 15 “నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు. 16 అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను. 17 రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు. 18 ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు. 19 అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు. 20 హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 21 హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.
మొత్తం 25 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 20 / 25
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References