1. {#1దావీదు సైనిక విజయాలు } [PS]దావీదు ఫిలిష్తీయులను ఓడించి వారిని లోబరచుకుని వారి ఆధీనంలో ఉన్న మెతెగమ్మాను ఆక్రమించుకున్నాడు.
2. అతడు మోయాబీయులను ఓడించి, పట్టుకున్న వారిని నేలపై బారుగా పడుకోబెట్టి తాడుతో కొలిపించాడు. రెండు కొలతల పొడవు ఉన్న వారిని చంపివేయాలనీ, ఒక కొలత పొడవు ఉన్న వారిని బతకనివ్వాలనీ నిర్ణయించాడు. అప్పటినుండి మోయాబీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. [PE]
3. [PS]సోబా రాజు రెహోబు కుమారుడు హదదెజరు ఫరాతు నది దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలు దేరాడు. దావీదు అతణ్ణి ఓడించి
4. అతని దగ్గరనుండి వెయ్యీ ఏడు వందల మంది గుర్రపు రౌతులను, ఇరవై వేల కాల్బలాన్ని పట్టుకుని, వారి గుర్రాల మందలో వంద ఉంచుకుని, మిగిలినవాటి చీలమండ నరాలను కోయించాడు. [PE]
5. [PS]దమస్కులో ఉన్న అరామీయులు సోబా రాజైన హదదెజెరుకు సహాయంగా వచ్చారు. దావీదు అరామీయ సైన్యంలో ఇరవై రెండు వేలమందిని హతమార్చాడు.
6. దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ ఉన్నాడు. [PE]
7. [PS]హదదెజెరు సేవకుల[* సేవకుల అధికారులు ] దగ్గర ఉన్న బంగారు శూలాలను దావీదు స్వాధీనం చేసుకుని యెరూషలేము పట్టణానికి తీసుకువచ్చాడు.
8. దావీదు రాజు హదదెజెరుకు చెందిన బెతహు, బేరోతై అనే పట్టణాల్లో ఉన్న విస్తారమైన ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. [PE]
9. [PS]దావీదు హదదెజెరు సైన్యం మొత్తాన్ని హతం చేశాడన్న వార్త హమాతు రాజైన తోయికి వినబడింది.
10. హదదెజెరు, తోయిల మధ్య విరోధం ఉంది. వాళ్ళ మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దావీదు హదదెజెరుతో యుద్ధం చేసి అతణ్ణి ఓడించాడు. ఆ వార్త తెలుసుకున్న తోయి తన కొడుకు యోరాము ద్వారా బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కానుకలుగా ఇచ్చి, క్షేమ సమాచారాలు అడిగి దావీదుతో కలసి సంతోషించి సమయం గడపడానికి దావీదు దగ్గరికి పంపించాడు. [PE]
11. [PS]రాజైన దావీదు అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల, అమాలేకీయుల రాజ్యాలను జయించి దోచుకొన్న బంగారం, వెండితో పాటు,
12. రెహోబు కొడుకు హదదెజెరు అనే సోబా రాజు దగ్గర దోచుకొన్న వాటితో తోయి కొడుకు యోరాము తెచ్చిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కూడా చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించాడు. [PE]
13. [PS]దావీదు ఉప్పు లోయలో పద్దెనిమిది వేలమంది అరామీయ సైన్యాలను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు అతని పేరు అన్నిచోట్లా ప్రసిద్ది చెందింది.
14. ఎదోమీయులు దావీదుకు దాసులయ్యారు. దావీదు ఎదోము దేశమంతటిలో తన సైన్యాన్ని నిలిపాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. [PE]
15. {#1దావీదు అధికారులు } [PS]దావీదు ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరి పట్లా నీతి న్యాయాలు జరిగించాడు.
16. సెరూయా కొడుకు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యానికి చెందిన దస్తావేజుల పర్యవేక్షణ అధికారి.
17. అహీటూబు కొడుకు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకులు యాజకులు. శెరాయా లేఖికుడు.
18. యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధికారి. దావీదు కొడుకులు రాజ్య సభలో ప్రముఖులు[† రాజ్య సభలో ప్రముఖులు యాజకులు ]. [PE]