పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
సమూయేలు రెండవ గ్రంథము
1. “సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని దావీదు అడిగాడు. [PE][PS]
2. సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. దావీదు మనుషులు అతణ్ణి దావీదు దగ్గరికి పిలుచుకు వచ్చారు. దావీదు రాజు “సీబావు నువ్వే కదా” అని అడిగాడు. అతడు “నీ సేవకుడినైన నేనే సీబాను” అన్నాడు.
3. అప్పుడు దావీదు “యెహోవా నాపై దయ చూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా?” అని అతణ్ణి అడిగాడు. [PE][PS] అప్పుడు సీబా “యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు” అని రాజుకు విన్నవించుకున్నాడు.
4. “అతడు ఎక్కడ ఉంటున్నాడు?” అని రాజు అడిగాడు. సీబా “అయ్యా, అతడు లోదెబారులో అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని రాజుతో చెప్పాడు.
5. అప్పుడు రాజైన దావీదు తన మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంటి నుండి అతణ్ణి తన దగ్గరికి రప్పించాడు. [PE][PS]
6. సౌలు కొడుకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “మెఫీబోషెతూ” అని అతణ్ణి పిలిచాడు. అతడు “అయ్యా, నీ దాసుణ్ణి. నేను ఇక్కడే ఉన్నాను” అన్నాడు.
7. దావీదు “నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి, నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంత కాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అని చెప్పాడు. [PE][PS]
8. అతడు నమస్కరించి “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నువ్వు కనికరం చూపించడానికి నీ దాసుణ్ణి నేను ఎంతవాణ్ణి?” అన్నాడు.
9. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి “సౌలు అతని కుటుంబం వారికి గతంలో ఉన్న ఆస్తి మొత్తాన్ని నీ యజమాని యోనాతాను కొడుకుకు తిరిగి ఇప్పించాను.
10. కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు. [PE][PS]
11. అప్పుడు సీబా “నా యజమానివైన రాజా, నీ దాసుణ్ణి నాకు సెలవిచ్చినట్టు అంతా జరిగిస్తాను” అని రాజుతో చెప్పాడు. అప్పటి నుండి మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడు అన్నట్టు రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ వచ్చాడు.
12. మెఫీబోషెతుకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు పసివాడు. అతని పేరు మీకా. సీబా కుటుంబం వారంతా మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు.
13. మెఫీబోషెతు యెరూషలేములో నివసించి కలకాలం రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్ళూ కుంటివి. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 24 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 9 / 24
సమూయేలు రెండవ గ్రంథము 9:38
1 “సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని దావీదు అడిగాడు. 2 సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. దావీదు మనుషులు అతణ్ణి దావీదు దగ్గరికి పిలుచుకు వచ్చారు. దావీదు రాజు “సీబావు నువ్వే కదా” అని అడిగాడు. అతడు “నీ సేవకుడినైన నేనే సీబాను” అన్నాడు. 3 అప్పుడు దావీదు “యెహోవా నాపై దయ చూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా?” అని అతణ్ణి అడిగాడు. అప్పుడు సీబా “యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు” అని రాజుకు విన్నవించుకున్నాడు. 4 “అతడు ఎక్కడ ఉంటున్నాడు?” అని రాజు అడిగాడు. సీబా “అయ్యా, అతడు లోదెబారులో అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని రాజుతో చెప్పాడు. 5 అప్పుడు రాజైన దావీదు తన మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంటి నుండి అతణ్ణి తన దగ్గరికి రప్పించాడు. 6 సౌలు కొడుకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “మెఫీబోషెతూ” అని అతణ్ణి పిలిచాడు. అతడు “అయ్యా, నీ దాసుణ్ణి. నేను ఇక్కడే ఉన్నాను” అన్నాడు. 7 దావీదు “నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి, నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంత కాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అని చెప్పాడు. 8 అతడు నమస్కరించి “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నువ్వు కనికరం చూపించడానికి నీ దాసుణ్ణి నేను ఎంతవాణ్ణి?” అన్నాడు. 9 అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి “సౌలు అతని కుటుంబం వారికి గతంలో ఉన్న ఆస్తి మొత్తాన్ని నీ యజమాని యోనాతాను కొడుకుకు తిరిగి ఇప్పించాను. 10 కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు. 11 అప్పుడు సీబా “నా యజమానివైన రాజా, నీ దాసుణ్ణి నాకు సెలవిచ్చినట్టు అంతా జరిగిస్తాను” అని రాజుతో చెప్పాడు. అప్పటి నుండి మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడు అన్నట్టు రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ వచ్చాడు. 12 మెఫీబోషెతుకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు పసివాడు. అతని పేరు మీకా. సీబా కుటుంబం వారంతా మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు. 13 మెఫీబోషెతు యెరూషలేములో నివసించి కలకాలం రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్ళూ కుంటివి.
మొత్తం 24 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 9 / 24
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References