1. {#1విలాప వాక్కులు, పశ్చాత్తాపానికి పిలుపు }
2. [PS]ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి. [PE][QS2]ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. [QE][QS2]ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. [QE][QS2]లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది. [QE]
3. [PS]యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, [PE][QS2]“ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు. [QE][QS2]వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.” [QE]
4. [PS]ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు, [PE][QS2]“నన్ను వెతికి జీవించండి. [QE]
2. [QS2]బేతేలును ఆశ్రయించవద్దు. [QE][QS2]గిల్గాలులో అడుగు పెట్టవద్దు. [QE][QS2]బెయేర్షెబాకు పోవద్దు. [QE][QS2]గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. [QE][QS2]బేతేలుకు ఇక దుఖమే.” [QE]
6. [PS]యెహోవాను ఆశ్రయించి జీవించండి. [PE][QS2]లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. [QE][QS2]అది దహించి వేస్తుంది. [QE][QS2]బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు. [QE]
2. [QS2]వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, [QE][QS2]నీతిని నేలపాలు చేస్తున్నారు. [QE]
2. [QS2]ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. [QE][QS2]చీకటిని తెలవారేలా చేసేవాడు. [QE][QS2]పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. [QE][QS2]సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి [QE][QS2]భూమి మీద కుమ్మరిస్తాడు. [QE]
2. [QS2]ఆయన పేరు యెహోవా. [QE][QS2]బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా [QE][QS2]నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి. [QE]
10. [PS]పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని [PE][QS2]వాళ్ళు అసహ్యించుకుంటారు. [QE][QS2]యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు. [QE]
2. [QS2]మీరు పేదలను అణగదొక్కుతూ [QE][QS2]ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, [QE][QS2]కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా [QE][QS2]వాటిలో నివసించరు. [QE][QS2]మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా [QE][QS2]ఆ ద్రాక్ష మద్యం తాగరు. [QE]
2. [QS2]మీ నేరాలెన్నో నాకు తెలుసు. [QE][QS2]మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. [QE][QS2]మీరు లంచాలు తీసుకుని [QE][QS2]తప్పుచేయని వారిని బాధిస్తారు. [QE][QS2]ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు. [QE]
2. [QS2]అది గడ్డుకాలం గనక [QE][QS2]ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు. [QE]
14. [PS]మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. [PE][QS2]అలా చేస్తే మీరనుకున్నట్టు [QE][QS2]యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు [QE][QS2]తప్పకుండా మీతో ఉంటాడు. [QE]
2. [QS2]చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. [QE][QS2]పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. [QE][QS2]ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు [QE][QS2]యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో. [QE]
16. [PS]అందుచేత యెహోవా ప్రభువు, [PE][QS2]సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే, [QE][QS2]“ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది. [QE][QS2]ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు. [QE][QS2]ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు. [QE][QS2]దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు. [QE]
2. [QS2]ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది. [QE][QS2]ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.” [QE]
18. {#1యెహోవా తీర్పు దినం } [PS]యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు [PE][QS2]ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? [QE][QS2]అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది. [QE]
2. [QS2]ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే [QE][QS2]ఎలుగుబంటి ఎదురు పడినట్టు, [QE][QS2]లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే [QE][QS2]పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది. [QE]
2. [QS2]యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా? [QE][QS2]కాంతితో కాక చీకటిగా ఉండదా? [QE]
21. [PS]మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు. [PE][QS2]మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు. [QE]
2. [QS2]నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా [QE][QS2]నేను వాటిని అంగీకరించను. [QE][QS2]సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను. [QE]
23. [PS]మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. [PE][QS2]మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను. [QE]
2. [QS2]నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. [QE][QS2]నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి. [QE]
25. [PS]ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు [PE][QS2]మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా? [QE]
2. [QS2]మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. [QE][QS2]సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు. [QE]
27. [PS]కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి [PE][QS2]మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, [QE][QS2]అని యెహోవా చెబుతున్నాడు. [QE][QS2]ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు. [QE]