పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
కొలొస్సయులకు
1. [PS]యజమానులారా, పరలోకంలో మీకు ఒక యజమాని ఉన్నాడని తెలుసుకోండి. మీ దాసుల పట్ల న్యాయమైన, సరైన దానిని చేయండి.
2. ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి. [PE]
3. [PS]దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను.
4. నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి. [PE]
5. [PS]సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
6. మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు. [PE]
7. [PS]ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు.
8. ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ మీ హృదయాలను ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను.
9. ఇతనితో కూడా మీ ఊరివాడు, నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు. [PE]
10.
11. [PS]నాతో కూడా చెరసాల్లో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు అభివందనాలు చెబుతున్నారు. ఈ మార్కు “మీ దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకోండి” అని మిమ్మల్ని గతంలోనే ఆదేశించాను గదా. [PE]
12. [PS]ఇంకా యూస్తు అనే పేరున్న యేసు కూడా మీకు అభివందనాలు చెబుతున్నాడు. వీరంతా సున్నతి పొందిన వర్గంలో ఉన్నవారు. వీరే దేవుని రాజ్యం కోసం నాకు జత పనివారు. వీరు నాకు ఆదరణగా ఉన్నారు. [PE][PS]మీలో ఒకడూ క్రీస్తు యేసు సేవకుడూ అయిన ఎపఫ్రా మీకు అభివందనాలు చెబుతున్నాడు. దేవుని సంకల్పమంతటిలో మీరు సంపూర్ణులుగానూ నిశ్చయతగలిగి నిలకడగానూ ఉండాలని ఇతడు ఎప్పుడూ మీ కోసం తన ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు.
13. ఇతడు మీకోసం, లవొదికయ వారి కోసం, హియెరాపొలి వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇది ఇతని గూర్చి నా సాక్ష్యం. [PE]
14.
15. [PS]ప్రియ వైద్యుడు లూకా, దేమా మీకు అభివందనాలు చెబుతున్నారు. [PE]
16. [PS]లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ, ఆమె ఇంట్లో ఉన్న సంఘానికీ అభివందనాలు తెలియజేయండి. [PE]
17. [PS]ఈ పత్రిక మీరు చదివాక లవొదికయలోని సంఘంలో చదివించండి. అలాగే నేను లవొదికయ సంఘానికి రాసి పంపిన పత్రికను మీరు తెప్పించుకుని చదవండి. [PE]
18. [PS]అలాగే, “ప్రభువులో నీకు అప్పగించిన సేవను నెరవేర్చడానికి జాగ్రతపడు” అని అర్ఖిప్పుతో చెప్పండి. [PE][PS]పౌలు అనే నేను ఇక్కడ నా చేతి రాతతో మీకు అభివందనాలు తెలియజేస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉండుగాక.[PE]
మొత్తం 4 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 4 / 4
1 2 3 4
1 యజమానులారా, పరలోకంలో మీకు ఒక యజమాని ఉన్నాడని తెలుసుకోండి. మీ దాసుల పట్ల న్యాయమైన, సరైన దానిని చేయండి. 2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి. 3 దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను. 4 నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి. 5 సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు. 7 ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు. 8 ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ మీ హృదయాలను ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను. 9 ఇతనితో కూడా మీ ఊరివాడు, నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు. 10 11 నాతో కూడా చెరసాల్లో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు అభివందనాలు చెబుతున్నారు. ఈ మార్కు “మీ దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకోండి” అని మిమ్మల్ని గతంలోనే ఆదేశించాను గదా. 12 ఇంకా యూస్తు అనే పేరున్న యేసు కూడా మీకు అభివందనాలు చెబుతున్నాడు. వీరంతా సున్నతి పొందిన వర్గంలో ఉన్నవారు. వీరే దేవుని రాజ్యం కోసం నాకు జత పనివారు. వీరు నాకు ఆదరణగా ఉన్నారు. మీలో ఒకడూ క్రీస్తు యేసు సేవకుడూ అయిన ఎపఫ్రా మీకు అభివందనాలు చెబుతున్నాడు. దేవుని సంకల్పమంతటిలో మీరు సంపూర్ణులుగానూ నిశ్చయతగలిగి నిలకడగానూ ఉండాలని ఇతడు ఎప్పుడూ మీ కోసం తన ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. 13 ఇతడు మీకోసం, లవొదికయ వారి కోసం, హియెరాపొలి వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇది ఇతని గూర్చి నా సాక్ష్యం. 14 15 ప్రియ వైద్యుడు లూకా, దేమా మీకు అభివందనాలు చెబుతున్నారు. 16 లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ, ఆమె ఇంట్లో ఉన్న సంఘానికీ అభివందనాలు తెలియజేయండి. 17 ఈ పత్రిక మీరు చదివాక లవొదికయలోని సంఘంలో చదివించండి. అలాగే నేను లవొదికయ సంఘానికి రాసి పంపిన పత్రికను మీరు తెప్పించుకుని చదవండి. 18 అలాగే, “ప్రభువులో నీకు అప్పగించిన సేవను నెరవేర్చడానికి జాగ్రతపడు” అని అర్ఖిప్పుతో చెప్పండి. పౌలు అనే నేను ఇక్కడ నా చేతి రాతతో మీకు అభివందనాలు తెలియజేస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉండుగాక.
మొత్తం 4 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 4 / 4
1 2 3 4
×

Alert

×

Telugu Letters Keypad References