1. {యుద్ధానికి వెళ్లినప్పుడు} PS “మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
|
3. ‘ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు.
|
4. అధైర్యపడవద్దు. వాళ్ళ ముఖాలు చూసి బెదరొద్దు. మీ కోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవా దేవుడే.’ PEPS
|
5. సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి. ‘మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.
|
6. ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.
|
7. ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పెళ్లి చేసుకోకముందే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పెళ్లిచేసుకుంటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.’ PEPS
|
8. సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు.’
|
11. వాళ్ళు మీ రాయబారం అంగీకరించి వారి ద్వారాలు తెరిస్తే దానిలో ఉన్న ప్రజలంతా మీకు పన్ను చెల్లించి మీకు బానిసలవుతారు.
|
14. స్త్రీలనూ పిల్లలనూ పశువులనూ ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్నీ కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు.
|
16. అయితే మీ యెహోవా దేవుడు వారసత్వంగా మీకిస్తున్న ఈ ప్రజల పట్టణాల్లో ఊపిరి పీల్చే దేనినీ బతకనివ్వకూడదు.
|
17. మీ యెహోవా దేవుడు మీ కాజ్ఞాపించినట్టుగా హీత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.
|
18. వారు తమ దేవుళ్ళకు జరిగించే అన్ని రకాల నీచమైన పనులు మీరు చేసి మీ యెహోవా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండేలా వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి. PEPS
|
19. మీరు ఒక పట్టాణాన్ని ఆక్రమించుకోవడానికి, దానిపై యుద్ధం చేయడానికి ముట్టడి వేసిన సమయంలో ఆ ప్రాంతంలోని చెట్లను గొడ్డలితో పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికి వేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలోని చెట్లు మనిషి కాదు కదా!
|
20. తినదగిన పండ్లు ఫలించని చెట్లు మీరు గుర్తిస్తే వాటిని నాశనం చేసి నరికి వెయ్యవచ్చు. మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయే వరకూ వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బలు కట్టవచ్చు.” PE
|